Spicy Drink : ఈ మసాల దినుసలతో కూడిన పానీయం తాగితే బరువు తగ్గటంతోపాటు, రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు!

మసాలా దినుసులు జీర్ణ సమస్యలను దూరం చేయడంలో, నయం చేయడంలో, చర్మానికి గ్లో ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి, అదే సమయంలో బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు, భారతీయ మూలికలైన మసాల దినుసులను రోజువారి ఆహారంలో చేర్చుకోవటం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు

Spicy Drink : భారతీయులు వంటకాల్లో ఉపయోగించే మసాలా దినుసులు కేవలం వంటలో రుచి, సువాసన కలిగించటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటాయి. మసాలా దినుసులు జీర్ణ సమస్యలను దూరం చేయడంలో, నయం చేయడంలో, చర్మానికి గ్లో ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి, అదే సమయంలో బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు, భారతీయ మూలికలైన మసాల దినుసులను రోజువారి ఆహారంలో చేర్చుకోవటం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

జీలకర్ర, వాము, సోపు ఈ మూడు ఔషధగుణాలు కలిగి ఉన్న మసాల దినుసులు. బరువు తగ్గడానికి,రోగనిరోధక శక్తిని పెంచటానికి పూర్తి స్ధాయి ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముందుగా వీటి ప్రయోజనాలు గురించి తెలుసుకుని ఆతరువాత ఈ మసాల దినుసులతో పానీయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం…

జీలకర్ర గింజలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతాయి.

వాము గింజలు విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా బరువును నిర్వహించడానికి ఆయుర్వేదంలో ఎక్కువగా సిఫార్సు చేయబడ్డాయి. జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడతాయి. జీవక్రియను ప్రోత్సహిస్తాయి. బరువు తగ్గించటంలో తోడ్పడతాయి. ఊపిరితిత్తులు శుభ్రంగా ఉంచుతాయి.ఆస్తమా రోగులకు ఉపయోగకరంగా ఉంటాయి.

సోపు గింజలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉంటాయి, ఇవి అత్యంత పోషకమైన మూలంగా చెప్పవచ్చు. డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వులు , పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉండటంతో శరీరం నుండి విషపదార్ధాలను, ఇతర హానికరమైన ద్రవాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.

ఈ మూడింటిని కలిపి పానీయాన్ని తయారు చేసుకుని ఉదయం పరగడుపున తాగటం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా బరువు సులభంగా తగ్గటంతోపాటు, వ్యాధులు దరిచేరకుండా రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు.

పానీయం తయారీ విధానం ; జీలకర్ర, సోపు,వాము గింజలు ఒక్కొక్కటి 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. అలాగే 1 కప్పు వేడి నీరు తీసుకోవాలి. జీలకర్ర, సోపు, జీరా, వాము గింజలను వేడి నీటిలో నానబెట్టి కలపాలి. రాత్రంతా వాటిని అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం, ఒక గ్లాసు తీసుకొని ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. రుచి కోసం కొంచెం తేనెను కలుపుకుని ఉదయాన్నే పరగడుపే ఈ మిశ్రమాన్ని సేవించాలి.

ట్రెండింగ్ వార్తలు