Earthquake: నాగాలాండ్‌, అసోంలో భూకంపం.. తీవ్రత ఎంతంటే?

దట్టమైన పర్వతాలతో ఉండే అసోంలో భూకంపం రావడం ఆందోళన కలిగించే అంశమే. అందులోనూ వరస భూకంపాలు ఇక్కడ కలవరపెడుతుంది. మార్చి నెలలో ఒకసారి భారీ భూకంపం సంభవించగా శనివారం మరోసారి భూప్రకంపనలు సంభవించాయి.

Earthquake: దట్టమైన పర్వతాలతో ఉండే అసోంలో భూకంపం రావడం ఆందోళన కలిగించే అంశమే. అందులోనూ వరస భూకంపాలు ఇక్కడ కలవరపెడుతుంది. మార్చి నెలలో ఒకసారి భారీ భూకంపం సంభవించగా శనివారం మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. నాగాలాండ్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.2 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. మోకోక్చుంగ్‌కు తూర్పున 74 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5 గంటలకు భూ ప్రకంపణలు వచ్చాయని, భూకంప కేంద్రాన్ని 81 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు ఎన్‌సీఎస్‌ పేర్కొంది.

అయితే, ఈ ప్రకంపనల వలన ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని వివరించింది. అలాగే అసోంలోని తేజ్‌పూర్‌లో సైతం ప్రకంపనలు కనిపించగా రిక్టర్‌ స్కేల్‌పై 3.9 తీవ్రత నమోదైనట్లు ఎన్‌సీఎస్‌ పేర్కొంది. తేజ్‌పూర్‌కు 41 కిలోమీటర్ల దూరంలో, భూమికి 16కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. కాగా, తరచూగా అసోంలో వరసగా ఈ ప్రకంపనలు రావడంపై అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రకంపనలకు కారణమేంటి? ఏం జరుగుతుందనే దానిపై లోతుగా పరిశీలన చేయనున్నట్లు తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు