Covid Vaccine
Covid Vaccine: కరోనా ఫస్ట్ వేవ్ లో మాస్క్, సోషల్ డిస్టెన్స్, హ్యాండ్ వాష్ ముఖ్యం కాగా.. సెకండ్ వేవ్ సమయానికి.. ఆ మూడింటికి తోడు వ్యాక్సిన్ కూడా జత కలిసింది. సమాజంలో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడం వలన కరోనాను కట్టడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన ప్రభుత్వాల నుండి చాలా కార్యాలయాల వరకు అందరూ వ్యాక్సిన్ ను ప్రాధాన్యతగా భావిస్తున్నారు. ఇక, వ్యాక్సిన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా సర్టిఫికెట్ కూడా అంతే ముఖ్యం. చాలా ఆఫీసుల నుండి ఎయిర్ పోర్టులు, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు సర్టిఫికెట్ ఉంటేనే విధులకు అవకాశం ఇస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆ సర్టిఫికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి.. ఎక్కడ తీసుకోవాలి.. అనేది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈమధ్య కాలంలో వాట్సప్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, వాట్సప్ తో పాటు పలు యాప్స్, వెబ్‌సైట్ల ద్వారా కూడా ఈ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇందులో ఆరోగ్యసేతు యాప్ ద్వారా సులభంగా సర్టిఫికెట్ చేసుకోవచ్చు. యాప్‌ను ఓపెన్ చేసి వ్యాక్సినేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేసి ఓటిపీ వెరిఫై చేసుకొని సర్టిఫికెట్ ఐకాన్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
www.cowin.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి ఓటీపీ వెరిఫై అయ్యాక.. సర్టిఫికెట్ బటన్ మీద క్లిక్ చేసి వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం కరోనా హెల్ప్ డెస్క్ నెంబర్ 9013151515 చాట్ బాక్స్‌ను ఓపెన్ చేసి.. Covid certificate అని టైప్ చేస్తే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని చాట్ బాక్స్‌లో టైప్ చేస్తే వ్యాక్సిన్ సర్టిపికెట్ పీడీఎఫ్ పార్మాట్‌లో వస్తుంది.
మైగవ్ యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసి Get your vaccination certificate అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ వెరిఫై చేస్తే వెంటనే సర్టిఫికెట్ డౌన్‌లోడ్ అవుతుంది.
ఉమంగ్ యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసి కోవిన్ అప్షన్ లో డౌన్‌లోడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మీద క్లిక్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా ఓటీపీని వెరిఫై చేసుకొని సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డిజిలాకర్ యాప్ లో అకౌంట్ క్రియేట్ చేసుకొని కోవిడ్ 19 అని సెర్చ్ బార్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే.. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆప్షన్ మీద క్తిక్ చేసి బెనిఫిషియరీ ఐడీని ఎంటర్ చేసి.. డాక్యుమెంట్ బటన్ మీద క్లిక్ చేస్తే సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.
ప్రముఖ వాలెట్ పేటీఎం యాప్‌ను ఓపెన్ చేసి Covid-19 Vaccine Slot Finder అని సెర్చ్ చేసి View beneficiaries ఆప్షన్ మీద క్లిక్ చేసి.. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీని వెరిఫై చేసి సర్టిఫికెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎకా కేర్ యాప్ ఓపెన్ చేసి కోవిన్ సర్టిఫికెట్ బటన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ద్వారా ఓటీపీని వెరిఫై చేసుకుని.. సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మైజియో యాప్ లేదా జియో హెల్త్ హబ్ యాప్‌లో కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ మొబైల్ ద్వారా ఓటీపీ వెరిఫై చేసి సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.