East Godavari: సెల్ఫీలు దిగుతూ గోదావరి నదిలో పడ్డ అక్కాచెల్లెళ్లు.. మృతి
తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ మాద్దూరు లంక వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరి అందాలను చూస్తూ సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రమాదవశాత్తూ నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు.
- T Venkateshwarlu
- Published On : June 26, 2022 / 09:32 AM IST
Drown
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ మాద్దూరు లంక వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరి అందాలను చూస్తూ సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రమాదవశాత్తూ నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు. బ్యారేజ్‌పై మద్దూరులంక సమీపంలో నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను నిడదవోలు మండలం పురుషోత్తపల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు కోసన లక్ష్మి ప్రసన్న (22), సాయి రాజేశ్వరి(21)గా పోలీసులు గుర్తించారు.
Maharashtra: మహారాష్ట్ర ఎమ్మెల్యేల హోటల్ బిల్ మేము కట్టం: అసోం సీఎం
పురుషోత్తపల్లి నుంచి గోదావరి చూడటానికి విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్‌పైకి వారు వచ్చినట్లు చెప్పారు. మధ్యలో మద్దూరులంక సమీపంలో సరదాగా ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని రక్షించి రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.
