P Chidambaram: బీజేపీ సూచనలతోనే ఈడీ, సీబీఐ దాడులు… అరెస్టైన వారిలో 95 శాతం ప్రతిపక్ష సభ్యులే: కాంగ్రెస్ నేత చిదంబరం

బీజేపీ సూచనలకు అనుగుణంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. మోర్బి బ్రిడ్జి ప్రమాద ఘటనపై గుజరాత్ ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

P Chidambaram

P Chidambaram: కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ.. బీజేపీ చెప్పినట్లే నడుచుకుంటున్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన మంగళవారం బీజేపీపై విమర్శలు చేశారు.

Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలన్ మస్క్ వారానికి ఎన్ని గంటలు పని చేస్తున్నాడో తెలుసా?

ప్రతిపక్షాల్ని లక్ష్యంగా చేసుకునే ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నాయన్నారు. ‘‘బీజేపీ ఆదేశాలకు అనుగుణంగానే ఈడీ, సీబీఐ పని చేస్తున్నాయి. ఇప్పటివరకు అరెస్టైన వారిలో 95 శాతం మంది ప్రతిపక్షాలకు చెందిన వాళ్లే. ఇక గుజరాత్‌లో ఇటీవల జరిగిన మోర్బి బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటివరకు ఎవరూ రాజీనామా చేయలేదు. కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ఇది బీజేపీ అహంకారానికి నిదర్శనం. ఈ ఘటన గుజరాత్‌కు అవమానం. దీనిపై ఎవరూ బాధ్యత తీసుకోలేదు. గుజరాత్‌ను పాలిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు. కేంద్రం తీసుకురావాలనుకుంటున్న ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని ఏ రాష్ట్రమూ అమలు చేయదని అందరికీ తెలుసు. కానీ, కేంద్రం మాత్రం పార్లమెంటులో చట్టం తీసుకొస్తుంది’’ అని చిదంబరం వ్యాఖ్యానించారు.

Sania Mirza: సానియా మీర్జా విడాకులకు సిద్ధమైందా.. షోయబ్ ఆమెను మోసం చేశాడా?

గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల 1, 5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్లు లెక్కింపు జరుగుతుంది. గుజరాత్ బీజేపీకి కంచుకోటగా చెప్పుకోవాలి. ఇక్కడ బీజేపీ వరుసగా ఆరుసార్లు గెలిచి అధికారం దక్కించుకుంది.