Election Commission: ఆగ‌స్టు 6న ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌: ఈసీ

ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఈ ఎన్నిక ఆగ‌స్టు 6న జ‌ర‌గ‌నుంది. అదే రోజున కౌంటింగ్ జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది.

Election Commission: ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఈ ఎన్నిక ఆగ‌స్టు 6న జ‌ర‌గ‌నుంది. అదే రోజున కౌంటింగ్ జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. ఈ ఎన్నిక‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ జూలై 5న విడుద‌ల చేస్తామ‌ని పేర్కొంది. జూలై 19 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ కొనసాగుతుంద‌ని తెలిపింది. 20న‌ నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నట్లు ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు జూలై 22 వ‌ర‌కు గ‌డువు ఉంటుంద‌ని తెలిపింది.

Maharashtra: రేపు బ‌ల‌ప‌రీక్ష.. మీ తీరు సరికాదు: సీఎం ఉద్ధ‌వ్‌కు గ‌వ‌ర్న‌ర్ లేఖ‌

సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఉదయం 10 నుంచి 5 గంటల వరకు పోలింగ్ ఎన్నిక ఉంటుంది. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నం.63లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఉప రాష్ట్రపతిని 788 మంది ఎంపీలు ఎన్నుకోనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా లోక్ సభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఉపరాష్ట్రపతి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. కాగా, ఆగస్టు 10తో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియ‌నుంది. దీంతో ఆ లోపు ఎన్నిక జ‌ర‌గాల్సి ఉంటుంది. ఉప రాష్ట్రప‌తిగా వెంక‌య్య నాయుడు 2017 ఆగ‌స్టు 11 నుంచి కొన‌సాగుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు