Elephant dance viral
Elephant dance viral : సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి ఉంది అంటారు. జంతువులతో డ్యాన్స్ చేయించగల శక్తి కూడా ఉందేమో? ఓ మాంచి పాటకి అమ్మాయి స్టెప్పులు వేసి చూపిస్తే ఏనుగు కూడా అనుకరించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
intelligent elephant : అరటిపండు తొక్క వొలిచి తింటున్న ఏనుగు వీడియో వైరల్
జంతువులకు మాటలు రాకపోయినా మనుష్యులు చెప్పే ఎన్నో విషయాలు అర్ధం చేసుకోగలవు. అంతేకాదు చెప్పింది చెప్పినట్లు చేసి చూపించగలవు. సాధారణంగా కొన్ని జంతువుల ఫీట్లు సర్కస్‌లలో చూస్తుంటాం. రీసెంట్ టైమ్‌లో ఓ డాగ్ తన యజమాని పేపర్ మీద రాసింది చేసి చూపించి అందర్నీ మెస్మరైజ్ చేసింది. తాజాగా ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) ఓ ఏనుగు డ్యాన్స్ అందర్నీ ఆకర్షించింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌కి (Jim Corbett National Park) వెళ్లిన ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ (Instagram content creator) వైష్ణవి నాయక్ (Vaishnavi Naik) ఓ పాటకి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఆమెకు కాస్త దూరంలో ఉన్న ఏనుగు కూడా వైష్ణవిని అనుకరిస్తూ స్టెప్పులు వేయడం మొదలుపెట్టింది. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: ఏనుగుల గుంపు హాయిగా ఎలా నిద్రపోతుందో చూశారా.. ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో
నిజానికి ఏనుగులు చాలా తెలివైనవి. వాటిని జనం ఇష్టపడతారు..పూజిస్తారు. అయితే ఈ పోస్ట్ చూసిన కొందరు ‘ చాలా అందమైన వీడియో.. ఏనుగులు ఎంతో దయగలవి దయచేసి వాటిమీద ఎక్కి స్వారీ చేస్తూ వాటిని ఇబ్బంది పెట్టద్దని’ కామెంట్ చేసారు. ఏనుగులు బంధించబడి ఉండటం వల్ల ఒత్తిడికి లోనై ఇలా ప్రవర్తిస్తుంటాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ వీడియోకి మాత్రం లక్షల్లో వ్యూస్ రావడం విశేషం.