Viral Video: ఏనుగుకు డబ్బా పాలు.. సీసాలకు సీసాలు స్వాహా!
సహజంగా పిల్లలకు అందించేందుకు తల్లి దగ్గర పాలు రాకపోతే డబ్బా పాలు పట్టిస్తారు. అందుకో పాల పీక.. ఎంత పాలలో ఎన్ని నీళ్లు కలిపితే బేబీకి ఆరోగ్యంగా ఉంటుందనే లెక్కలు చాలానే ఉంటాయి.
- Naresh Mannam
- Updated on- July 3, 2021 / 05:31 PM IST
Viral Video
Viral Video: సహజంగా పిల్లలకు అందించేందుకు తల్లి దగ్గర పాలు రాకపోతే డబ్బా పాలు పట్టిస్తారు. అందుకో పాల పీక.. ఎంత పాలలో ఎన్ని నీళ్లు కలిపితే బేబీకి ఆరోగ్యంగా ఉంటుందనే లెక్కలు చాలానే ఉంటాయి. అవన్నీ ఆ తల్లులకే ఎరుక. అయితే.. ఓ ఏనుగుకు డబ్బా పాలు పట్టిస్తే ఎలా ఉంటుందంటారు. అసలు ఏనుగేమిటి పాలు తాగడం ఏమిటీ.. అది కూడా డబ్బా పాలు పట్టించడం ఏంటి అనుకుంటున్నారా?
సహజంగా చిన్న పిల్లలు పాలు తాగాలంటే మరొకరి సాయం కావాల్సి ఉంటుంది. మనిషి సీసా లేదా గ్లాసు పట్టుకుంటే పిల్లలు తాగేస్తారు. మరికొందరు వాళ్ళే సీసాను చేతికిస్తే గడగడా లాగించేస్తారు. అచ్చంగా ఈ ఏనుగు కూడా తొండంతో బాటిల్‌ను పట్టుకుని గడగడా తాగేస్తుంది. దీనికి సంబంధించిన 11 సెకన్ల వీడియోను షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. డబ్బాతో పాలు తాగుతున్న ఏనుగు ‘బిగ్ బేబీ’లా ఉందంటూ నెటిజన్లు కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు క్యూటీ.. సో స్వీట్ అంటూ గజరాజుని కూడా తెగ గారాబం చేస్తున్నారు.
Bottoms up 🍼 pic.twitter.com/gPkGyhlBOM
— Sheldrick Wildlife Trust (@SheldrickTrust) July 1, 2021
