క్రాకర్స్ నింపిన ఫైనాఫిల్ తిన్న ఏనుగు.. రోజులు తరబడి నొప్పితోనే నడుస్తూ ప్రాణాలు విడిచింది!

  • Publish Date - June 3, 2020 / 09:37 AM IST

గర్భంతో ఉన్న ఏనుగుకు క్రాకర్స్ పెట్టిన ఫైనాఫిల్ తిని ప్రాణాలు విడిచిన ఘటన స్థానికంగా కేరళను కదిలించింది. ఆకలితో ఉన్న గజరాజును ఆకతాయిలు క్రాకర్స్ పెట్టిన ఫైనాఫిల్ తినిపించడంతో పేలి తీవ్ర గాయాలయ్యాయి. నోరు, ముఖం కాలిపోవడంతో తీవ్రమైన నొప్పి.. మంట భరించలేని ఆ ఏనుగు.. అటు ఇటు పరుగులు తీసింది. రోజుల తరబడి నొప్పితోనే నడుస్తూ చివరికి నదిలోకి వెళ్లి ప్రాణాలు విడిచింది. కేరళలోని ముళప్పురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నోట్లో టపాసులు పేలుతున్నా ఎవరిపై అది దాడి చేయలేదు. నొప్పి బాధిస్తున్నా గ్రామాల్లో తిరుగుతూనే చివరికి ఏనుగు మృతిచెందింది. అది చూసి అక్కడివారంతా చలించపోయారు. ఏనుగు మృతికి కారణమైన ఆకతాయిలపై ఎలాంటి చర్యలు తీసుకులేదు. ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు. మరోవైపు గర్భంతో ఉన్న ఏనుగు ప్రాణాలు తీసిన ఆకతాయిలపై కఠినంగా శిక్షించాలని వేలాది మంది డిమాండ్ చేస్తున్నారు.

గుర్తు తెలియని ఆకతాయిలను గుర్తించి కేసు నమోదు చేసేందుకు కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏనుగు మృతి ఘటనపై ఓ ఫారెస్ట్ అధికారి సోషల్ మీడియాలో వివరాలు తెలియజేయడంతో వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ చివరిలో లేదా మే మొదటివారంలో ఏనుగు ఫైనాఫిల్ తిన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఏనుగు ఫైనాఫిల్ ఎప్పుడు తిన్నదో కచ్చితంగా తెలియదని అంటున్నారు.

కానీ, ఏనుగు మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం 20 రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారి అశిక్ అలీ తెలిపారు. ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించారు. ఆహారాన్ని వెతుకుంటూ సమీపంలోని గ్రామంలోకి ఏనుగు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. పొలాలను నాశనం చేస్తున్న అడవి పందుల నుంచి రక్షణ కోసం స్థానికంగా క్రాకర్లను వాడుతుంటారు. ఆకతాయిలు తినిపించిన ఫైనాఫిల్ లో క్రాకర్లు పెట్టారు.

అలానే తినేయడంతో క్రాకర్స్ ఏనుగు నోట్లనే పేలాయి. నాలుక, గొంతు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాలిన మంటతో తీవ్ర గాయాలతో అలానే రోజులు తరబడి గ్రామాల్లో తిరిగింది. నోరంతా గాయాలు కావడంతో ఆకలి వేస్తున్న తినలేక తల్లడిల్లిపోయింది. ఏనుగు మృతిచెందడానికి రెండు రోజులు ముందు మాత్రమే ఫారెస్ట్ అధికారులకు తెలిసింది. ఒళ్లంతా మంట, నొప్పి నుంచి ఉపశమనం కోసం నదిలోకి దిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో రెండు ఏనుగుల సాయంతో చనిపోయిన ఏనుగును బయటకు తీశారు. 

ట్రెండింగ్ వార్తలు