Lucifer Remake: అంతా సిద్ధం.. చిరు సినిమా లాంచింగ్ డేట్ ఎప్పుడంటే?
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు చేతిలో మూడు సినిమాలుండగా అందులో మలయాళ హిట్ సినిమా లూసిఫర్ రీమేక్ మీద ఇటు మెగా కాంపౌండ్ తో పాటు అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
- Naresh Mannam
- Updated on- June 6, 2021 / 01:18 PM IST
Everything Is Ready Lucifer Remake Launching On Chiru Birthday
Lucifer Remake: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు చేతిలో మూడు సినిమాలుండగా అందులో మలయాళ హిట్ సినిమా లూసిఫర్ రీమేక్ మీద ఇటు మెగా కాంపౌండ్ తో పాటు అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రీమేక్ లో తెలుగుకు తగ్గట్లు మార్పులు, స్క్రిప్ట్, మాటలు, క్యాస్టింగ్ పనిలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ మధ్య దర్శకుడి ఎంపికపై రకాకాల ప్రచారాలు వినిపించినా చివరికి దర్శకుడు మోహన్ రాజానే ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
మోహన్ రాజానే ఈ సినిమాకు మార్పులు, చేర్పులు చేశాడు. రచయిత లక్ష్మి భూపాల్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. క్యాస్టింగ్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఒరిజినల్ మలయాళంలో ఈ పాత్రలో మంజు వారియర్ నటించగా తెలుగులో విద్యాబాలన్ నటించనుందని వినిపిస్తుంది. మరో ముఖ్యపాత్రలో సత్యదేవ్ కూడా నటించనున్నాడని చెప్తున్నారు. కాగా.. ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.
త్వరలోనే ఈ సినిమా లాంచింగ్ సన్నాహాలు మొదలుకానున్నాయట. మెగా అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మెగా కాంపౌండ్ నుండి బలంగా వినిపిస్తుంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుండగా అప్పటికి ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తిచేసి లాంచింగ్ అయిన వెంటనే షూటింగ్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారట.
