Munugode Bypoll Results: మరోసారి నిజమైన ఎగ్జిట్ పోల్స్.. ఏ సంస్థ ఏం చెప్పిందంటే..?

"ఎగ్జిట్ పోల్స్".. ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడకముందే విజయం ఎవరిదో.. ఏ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందో చెప్పేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కోసారి తప్పుగా రావచ్చేమో గానీ, అలా జరగడం చాలా అరుదుగా మారిపోయింది. ప్రజల మనసులో ఏముందో, ఏ పార్టీకి ఓట్లు వేశారో తెలుసుకోవడంతో ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కచ్చితమైన రీతిలో తెలుసుకుంటున్నాయి. తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ముగియగానే పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.

Munugode Bypoll Results: “ఎగ్జిట్ పోల్స్”.. ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడకముందే విజయం ఎవరిదో.. ఏ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందో చెప్పేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కోసారి తప్పుగా రావచ్చేమో గానీ, అలా జరగడం చాలా అరుదుగా మారిపోయింది. ప్రజల మనసులో ఏముందో, ఏ పార్టీకి ఓట్లు వేశారో తెలుసుకోవడంతో ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కచ్చితమైన రీతిలో తెలుసుకుంటున్నాయి. తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ముగియగానే పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.

ఏ పార్టీ గెలిచే అవకాశం ఎంతగా ఉందో, ఓట్ల శాతం ఎంత ఉంటుందో అంచనాలు చెప్పాయి. టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ‘ఆత్మ సాక్షి’ సంస్థ.. టీఆర్ఎస్ కు పడే ఓట్ల శాతం 41 నుంచి 42 శాతం మధ్య, బీజేపీకి 35 నుంచి 36 శాతం, కాంగ్రెస్ కు 16.5 నుంచి 17.5 శాతం అవకాశాలు ఉన్నాయని చెప్పింది.

పీపుల్స్ పల్స్ సంస్థ టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు 44.4 శాతం ఉన్నాయని తెలిపింది. బీజేపీ గెలుపు అవకాశాలు 37.3 శాతం ఉన్నట్లు పేర్కొంది. అలాగే, త్రిశూల్ సంస్థ టీఆర్ఎస్ కు వచ్చే ఓట్ల శాతం 47 శాతం, బీజేపీకి 31 శాతం, కాంగ్రెస్ పార్టీకి 18 శాతం ఉంటుందని చెప్పింది. థర్డ్ విజన్ సంస్థ టీఆర్ఎస్ కు 48 నుంచి 51 శాతం మధ్య, బీజేపీకి 31 నుంచి 35 శాతం మధ్య ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కేఏ పాల్ పార్టీకి ఒక శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. చివరకు చాణక్య మినహా అన్ని సంస్థలు అంచనా వేసినట్లుగానే టీఆర్ఎస్ మునుగోడులో దూసుకువెళ్లింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు