Cracker Factory Explosion: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి, 13 మందికి గాయాలు

మధురై జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు ప్రాణాలుకోల్పోగా.. 13మందికి గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ భవనం కూలడంతో శిథిలాల కింద చిక్కుకొని ఐదుగురు మరణించారు.

Cracker Factory Explosion: తమిళనాడులోని మధురై జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలుకోల్పోగా.. 13మందికి గాయాలయ్యాయి. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో ఫ్యాక్టరీ భవనం పూర్తిగా నేలమట్టమైంది. మదురై జిల్లాలోని ఉసిలంపట్టి సమీపంలోని అజగుసిరై గ్రామంలోని బాణసంచా ఫ్యాక్టరీలో ఈ విషాదం చోటు చేసుకుంది. పేలుడు శబ్దం విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు.

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

పేలుడులో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు బాణాసంచా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని చేరుకుని మంటలను అదుపుచేశారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతుల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు.

Snake in 104 Vehicle Steering : 104 వాహనంలో స్టీరింగ్ పైకి వచ్చిన పాము .. భయంతో దూకేసిన డ్రైవర్

పేలుడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పేలుడు వెనుక గల కారణాలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతులు వల్లరాసు, గోపి, విక్కి, అమ్మాసి, ప్రేమగా గుర్తించారు. వీరు జిల్లాలోని వడక్కంపట్టి గ్రామానికి చెందినవారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర మంత్రి పి.మూర్తి, జిల్లా కలెక్టర్ ఎస్ అనీష్ శేఖర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

ట్రెండింగ్ వార్తలు