F3 Team Wishes Happy Holi With Joyful Video
F3: 2019లో వచ్చిన F2 చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ చాలా కాలం తరువాత పూర్తి కామెడీ జోనర్ మూవీ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామలు తమన్నా, మెహ్రీన్ పీర్జాదాలకు తోడుగా బోలెడంత మంది నటీనటులు కలిసి చేసిన ఫన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మూడేళ్ల తరువాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు చిత్ర యూనిట్.
F3 Movie: ఎఫ్3 మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే?
దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి ఆడియెన్స్‌కు అదే తరహా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు F3 అనే సీక్వెల్ చిత్రంతో మనముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలోనూ మొదటి భాగంలో నటించిన నటీనటులు అందరూ కనిపిస్తుండగా, కొత్తగా మరికొంత మంది ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో జాయిన్ అయ్యారు. వారిలో నటుడు సునీల్, అందాల భామ సోనాల్ చౌహాన్‌లు ఉన్నారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కాంబినేషన్ సరొకత్తగా ఉండటమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఎఫ్2 సినిమా బాగా అలరించడంలో సక్సెస్ అయ్యింది.
ఇక ఇప్పుటికే ఎఫ్3 సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, ఈ సినిమాను వేసవి కానకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. తాజాగా హోలీ సందర్భంగా ఈ సినిమాలోని నటీనటుల నవ్వులను పంచుతూ ఓ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఫ్రస్ట్రేషన్ లేని ఫన్‌తో ఈ చిత్ర నటీనటులు కనిపించడం చాలా బాగుందని అభిమానులు అంటున్నారు. ఇక ఎఫ్3 చిత్రంలో డబ్బు కోసం హీరోలు ఎలాంటి ఫన్ క్రియేట్ చేస్తారా అనేది సినిమా కథగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఆడియెన్స్‌కు బాగా నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అటు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కడుపుబ్బా నవ్విస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
F3 Movie: లబ్ డబ్ డబ్బో.. పైసా ఉంటే ప్రపంచమే పిల్లి!
అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. తొలి భాగం సంక్రాంతి కానుకగా రిలీజ్ కాగా, రెండో భాగం వేసవి కానకుగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాను మే 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు F3 యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ సినిమా ఎలాంటి నవ్వులు పూయిస్తుందో తెలియాలంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.
#F3Movie Family wishes you all a very Happy & Safe Holi ♥️
May the festival of colours fill your lives with lots of happiness ?✨#HappyHoli@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @AnilRavipudi @ThisIsDSP @adityamusic @SVC_official @f3_movie #F3OnMay27 pic.twitter.com/hlp7aGGrUz
— Sri Venkateswara Creations (@SVC_official) March 18, 2022