మీ ఫేస్‌బుక్ అకౌంట్లో మీకు మీరే సొంతంగా అవతార్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? ఇతర సోషల్ అకౌంట్లో మాదిరిగానే అవతార్ ఎమోజీలు, కార్టూనిస్ట్ రోల్స్ ఇలా మరెన్నో అవతార్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ప్రీ ఇన్ స్టాల్డ్ అవతార్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి ఫేస్ బుక్ అకౌంట్ యూజర్లకు అవతార్ ఫీచర్లు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ కెనడాలో మాత్రమే ఇప్పటివరకూ అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు ఫేస్ బుక్ కంపెనీ తమ యూజర్ అకౌంట్స్ కలిగిన అతిపెద్ద మార్కెట్లలో ఒకటి అయిన ఇండియాలోనూ ఈ ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని సాయంతో భారతీయ ఫేస్‌బుక్ యూజర్లు స్నాప్‌చాట్ బిట్‌మోజీ, ఆపిల్ మెమోజీల మాదిరిగానే చాట్లలో తమను తాము కార్టూనిష్ రోల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త ఫేస్ బుక్ అవతార్ ఫీచర్.. యూజర్లు ఇప్పుడు వారి కార్టూనిష్ రోల్‌ను ఇతరులతో క్రియేట్ చేసుకోవచ్చు.
షేర్ కూడా చేసుకోవచ్చు. పోస్ట్‌లపై, ప్రొఫైల్ పిక్ లోపల, మెసెంజర్ చాట్ విండోస్‌లో చాట్ చేసేటప్పుడు ఈ అక్షరాలను వాడొచ్చు. యూజర్లు స్నాప్‌చాట్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి థర్డ్ పార్టీ యాప్‌లకు కూడా ఈ అవతార్‌లను ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు. మీ స్వంత ఫేస్‌బుక్ అవతార్‌ను క్రియేట్ చేయాలనుకుంటే ఈ కింది విధంగా ప్రయత్నించండి. ఆ తర్వాత మీ స్నేహితులకు నచ్చిన అవతార్ పంపుకోవచ్చు.
* గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఫేస్‌బుక్ యాప్‌ను సరికొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.
* ఫేస్‌బుక్ యాప్‌లోకి వెళ్లి రైట్ టాప్ కార్నర్‌లో హాంబర్గర్ మెనుపై Tap చేయండి. iOS యూజర్ల కోసం హాంబర్గర్ మెను కింది రైట్ కార్నర్ లో ఉంటాయి.
* కొద్దిగా కిందికి స్క్రోల్ చేయండి.. ‘See More’ ఆప్షన్‌పై నొక్కండి.
మొబైల్ యాప్ కోసం Facebook Dark Mode ఇప్పుడు కొంతమంది యూజర్లకు అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా వాడాలంటే?
* ‘Avatars’ ఆప్షన్‌పై నొక్కండి.
* ఇప్పుడు మీరు హెయిర్ స్టయిల్, ఫేస్ షేప్, ఫేస్ లైన్స్ ఎంచుకోవడం ద్వారా మీ అవతార్‌ను కస్టమైజ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టుగా అవతార్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకునే అనేక కస్టమైజ్ డ్ ఆప్షన్లు యాప్‌లో ఉన్నాయి.
* మీరు అవతార్ కోసం బాడీ షేప్ కూడా ఎంచుకోవాలి.
* మీరు అన్ని కస్టమైజ్ లతో పూర్తి చేయాలి.. టాప్ రైట్ కార్నర్ లో ఉన్న పూర్తయిన ఐకాన్ పై మీరు Tap చేయొచ్చు.
* అప్పుడు యాప్ మీ అవతార్‌ను క్రియేట్ చేస్తుంది. మీరు మీ అవతార్‌ను ఎలా వాడాలో కూడా టిప్స్ సూచిస్తుంది.
* మీ అవతార్ కోసం ఒక యాంగిల్ ఎంచుకోండి. మీ ఫీడ్‌లో షేర్ చేయమని అడుగుతుంది. ఈ స్టెప్ Skip చేసే ఆప్షన్ కూడా ఉంది.
* మీ ఫేస్‌బుక్ అవతార్‌ను వాడేందుకు మీరు ఏదైనా Text ఫీల్డ్‌లోని స్మైలీ ఫేస్ ఐకాన్‌పై Tap చేయండి.
* చివరిగా, స్టిక్కర్ సెక్షన్ నుంచి అవతార్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
Read:YouTube TVలో నెలవారీ సబ్ స్ర్కిప్షన్ ధరలు పెరిగాయి.. ఎంతంటే?