Rowan Atkinson: మిస్ట‌ర్ బీన్ చనిపోయాడని త‌ప్పుడు ప్ర‌చారం.. ఏడవసారి ఇలా!

ఆలు చూలు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంటుంది మన సోషల్ మీడియాలో యవ్వారం. ఎక్కడో ఓ నెటిజన్ ముందు వెనకా చూసుకోకుండా వ్యూస్, లైక్స్ కోసమే అన్నట్లుగా ఓ పోస్ట్ పెడితే.. దాన్ని నిజానిజాలు తెలుసుకోకుండా షేర్లు, లైక్స్ ఇచ్చి దానినో వైరల్ చేసేస్తుంటారు.

False Propaganda That Mr Bean Is Dead Like This For The Seventh Time

Rowan Atkinson: ఆలు చూలు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంటుంది మన సోషల్ మీడియాలో యవ్వారం. ఎక్కడో ఓ నెటిజన్ ముందు వెనకా చూసుకోకుండా వ్యూస్, లైక్స్ కోసమే అన్నట్లుగా ఓ పోస్ట్ పెడితే.. దాన్ని నిజానిజాలు తెలుసుకోకుండా షేర్లు, లైక్స్ ఇచ్చి దానినో వైరల్ చేసేస్తుంటారు. వైరల్ కావడం.. నిజాన్ని అబద్దాలుగా నమ్మించడం సోషల్ మీడియాకే చెల్లిన అంశం కాగా.. ఇక్కడ లక్షణంగా ఉన్న మనుషులను కూడా తమ పోస్టుల కోసం చంపేసి రెస్ట్ ఇన్ పీస్ చేసేస్తుంటారు కూడా. ఇదిగో ఇప్పుడు మీరు చదివే స్టోరీ కూడా అదే.

మిస్టర్ బీన్ అనే మాట చాలు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు ఒక పేస్ కళ్ళ ముందు కనిపిస్తుంది. అలా 90ల కాలంలో నుండి మిస్టర్ బీన్ క్యారెక్టర్​తో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల‌ని సంపాదించుకున్నాడు రోవాన్ ఎట్కిన్‌స‌న్. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్న రోవాన్ చనిపోయాడని ఓ ఫేక్ బుక్ బోగస్ పేజీ పోస్ట్ పెట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులంతా నిజమేనని నమ్మి షేర్లు చేసి సంతాపం తెలిపారు. మే 29న పెట్టిన ఈ పోస్ట్ వారం రోజుల పాటు సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొట్టింది.

చివరికి రోవాన్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలియ‌డంతో నెటిజ‌న్స్ బోగ‌స్‌ పేజ్ నిర్వాహ‌కుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి ఆ పేజీ నుంచి పోస్ట్ డిలీట్​ చేశారు. అయితే.. ఇలా రోవాన్ చనిపోయాడని ప్రచారం జరగడం కొత్తేమీ కాదు. ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఏడుసార్లు రోవాన్ చనిపోయాడని ప్రచారం చేశారు. 2012, 2013, 2015, 2016, 2017, 2018 సంవ‌త్స‌రాల‌లో త‌ప్పుడు ప్ర‌చారం జ‌రిగగా ఇప్పుడు మళ్ళీ ఇలా అదే ప్రచారం చేశారు. కానీ 66 సంవత్సరాల మిస్టర్ బీన్ మాత్రం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు.