bride dance viral
bride dance viral : ఆడపిల్లకి తల్లితో కన్నా తండ్రితో ఉన్న అనుబంధం ప్రత్యేకం. ఆడపిల్ల పుట్టగానే ఎంతో సంబరపడే తండ్రి ఆమె పెరిగి పెద్దై అత్తారింటికి వెళ్తుంటే అంతే బాధపడతాడు. ఓ అమ్మాయి తన పెళ్లి వేడుకులో తండ్రి కోసం ప్రత్యకంగా డ్యాన్స్ చేస్తూ పాట పాడితే ఆ తండ్రి కన్నీరు పెట్టుకున్న వైనం చూసేవారిని కంటతడి పెట్టించింది.
గ్రాండ్‌గా పెళ్లి వేడుక జరుగుతోంది. అందంగా ముస్తాబైన వధువు దిల్బరో పాటకు డ్యాన్స్ చేస్తోంది. ఆమె తండ్రి ఒక్కసారి ఆశ్చర్యంగా వేదికవైపు చూసాడు. అంతే ఆనందంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత వేదికపైకి వెళ్లి తన కూతురి పక్కన నిలబడి ఆమె కోసం ఒక పద్యం చెప్పాడు. వెంటనే ఆమె కూడా కన్నీటి పర్యంతమైంది. అక్కడ ఉన్నవారంతా ఈ సన్నివేశాల్ని చూసి చలించిపోయారు. ఇన్‌స్టాగ్రామ్ పేజీ షాదీబిటిఎస్ షేర్ చేసిన వీడియో చాలామంది మనసుని టచ్ చేసింది. ఈ వీడియో చాలా హత్తుకుందని.. కన్నీరు ఆపలేకపోయామని కొందరు.. తండ్రీ,కూతుళ్ల అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే అని మరికొందరు రిప్లై చేస్తున్నారు.
Daughter Gift : మొదటి జీతంతో తండ్రికి విలువైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. వీడియో వైరల్
పెళ్లిళ్లలో సంప్రదాయ బద్ధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో సంగీత్ ఇప్పుడు చాలా ప్రత్యేకం. అందరూ కలిసి సరదాగా డ్యాన్స్‌లు చేసి సంబరాలు జరుపుకుంటారు. ఇక ఆడపెళ్లివారు నిర్వహించే ప్రతి తంతులోనూ సెంటిమెంట్స్ కూడా నిండి ఉంటాయి. అత్తవారింటికి సాగనంపే సమయంలో ఆ కుటుంబం పడే బాధ కూడా కన్నీరు పెట్టిస్తుంది. తన కూతురు మెట్టినింటికి వెళ్తోందన్న సంతోషంతో పాటు.. తమకు దూరం అవుతోందన్న బాధ చూసేవారికి కూడా కంటతడి పెట్టిస్తుంది. ఇక తండ్రీకూతుళ్ల ప్రేమకు అద్దం పడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.