సింధు లోయ నాగరికులు.. మాంసాన్ని ఎక్కువగా తినేవారంట.. ఇదిగో ప్రూఫ్..!

  • Publish Date - December 10, 2020 / 08:57 PM IST

meat-heavy diets of Indus Civilization : ప్రాచీన సింధు లోయ నాగరికతకు సంబంధించి పురావస్తు శాఖ తవ్వకాల్లో కొత్త అంశాలు ఇంకా వెలుగులోకి వస్తునే ఉన్నాయి. సింధు నాగరికుల ఆహారపు అలవాట్లు, వారి జీవన విధానాలు ఎలా ఉంటాయో ఆసక్తికరమైన అంశాలు బయటపడుతున్నాయి. సింధు లోయ నాగరికతకు చెందిన వివిధ ప్రాంతాలలోని అడుగు పొరల శిథిలాల్లో ఇప్పుడు ప్రాచీన సిరామిక్ మట్టి కుండలు బయటపడ్డాయి. ఈ కుండలపై కొవ్వు అవశేషాలు ఉన్నాయని పురావస్తు శాఖకు చెందిన పరిశోధకులు గుర్తించారు.



వీటిపై లోతుగా విశ్లేషించిన అనంతరం సింధు నాగరికతలో ఎక్కువగా మాంసపు ఉత్పత్తులను వాడేవారని నిర్ధారణకు వచ్చారు. మట్టి కుండల మీద ఉన్న కొవ్వు అవశేషాలను పరిశీలించగా.. అవి అప్పటి పశువులు, గొర్రెలు, మేకలు, గేదెలు, పందులకు సంబంధించిన కొవ్వు అవశేషాలుగా కనిపెట్టారు. అంతేకాదు.. జంతు పెంపంకలోనూ సింధు నాగరికులకు చాటి ఎవరులేరు కూడా. అప్పట్లోనే పాల ఉత్పత్తుల తయారీలో సిద్ధహస్తులుగా పేరొందారు.



ప్రాచీన సింధనాగరికత మూలాలు కలిగిన వాయువ్య భారతదేశంలో అప్పటి గ్రామీణ, పట్టణ నగరాల్లోనే ఈ మాంసపు కొవ్వు అవవేషాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలు హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలుగా ఉన్నాయని పురావస్తు పరిశోధకులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. ప్రాన్స్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలోని ఆర్కియాలజీ విభాగంలో మాజీ పీహెచ్‌డీ విద్యార్థి, డాక్టర్ అక్షయతా సూర్యనారాయణన్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనాన్ని జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్‌లో ప్రచురించారు. తవ్వకాల్లో బయటపడ్డ ప్రాచీన మట్టి కుండలపై కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాల అవశేషాలను గుర్తించామని ఆయన చెప్పారు.

దీనిబట్టి సింధు నాగరికులు మాంసపు ఉత్పత్తులను ఎక్కువగా కుండల్లో వంటకాలు చేసేవారని తెలిపారు. సింధు నాగరికత సింధు నగర ప్రాంతాల్లో తవ్వకాల్లో కుండలలో అవశేషాలను పలు సింధు నాగరిక ప్రాంతాల్లోనూ బయటపడ్డాయని అధ్యయనంలో పేర్కొన్నారు. అప్పటి సిరామిక్ మట్టికుండలలో వివిధ రకాల జంతువుల మాంసాన్ని ఎలా వండేవారో తెలియజేస్తుందని సూర్యనారాయణ్ తెలిపారు. పాల ఉత్పత్తుల కంటే మాంసపు ఉత్పుత్తులనే సింధు నాగరికులు ఎక్కువగా వాడేవారని కొవ్వు అవశేషాలను పరిశీలిస్తే అర్థమవుతోందని చెప్పారు. గతంలోనే అనేక పరిశోధనల్లో సింధు నాగరికులు డెయిరీ ఉత్పత్తులను వాడేవారని గుర్తించారు. గుజరాత్ లో డెయిరీ ప్రొడక్టులకు సంబంధించి గిన్నెల అవశేషాలు బయటపడ్డాయి.



వాయువ్య భారతదేశంలోని గ్రామీణ, పట్టణ సింధు ప్రాంతాల్లో లభ్యమైన మట్టి కుండలలో కనిపించిన కొవ్వు అవశేషాలు.. హరప్పన్ కాలంలో (క్రీ.పూ.2600 / 2500-1900 BC) ఆహారపు ఉత్పత్తులకు సమానంగా ఉన్నాయని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ సీనియర్ రచయిత డాక్టర్ కామెరాన్ పెట్రీ తమ పరిశోధనలో గుర్తించామన్నారు. అలాగే సింధునాగరికుల వంట పద్ధతులు, ఆహార పదార్థాల తయారీ విధానాలు రెండూ ఒకేలా ఉన్నాయన్నారు. దక్షిణ ఆసియాలోని మట్టి పాత్రలలో ఆహార పదార్థాల వినియోగానికి సంబంధించి పలు అంశాలను గుర్తించమన్నారు.

ట్రెండింగ్ వార్తలు