Fine If You Go Outside Without Getting Vaccinated In Aurangabad
Vaccine Fine: ఇప్పటి వరకు మనం పోలీసులు విధించే రకరకాల జరిమానాలను చూశాం. ట్రాఫిక్ పోలీసులు వేసే ఫైన్లు కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోకుండా రోడ్ మీద తిరిగితే ఫైన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. మహారాష్ట్ర గత ఏడాది నుండి కరోనాతో ఎంతసతమయ్యిందో మనం చూశాం కదా. అందులో కూడా ప్రధాన నగరాలలో ఒకటైన ఔరంగాబాద్లో కూడా కరోనా విలయతాండవం చేసింది. ఇక్కడి ప్రజలందరికీ టీకా వేసి థర్డ్ వేవ్ లో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే టీకా కార్యక్రమాన్ని కఠినంగా అమలు చేస్తుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 సంవత్సరాల లోపు వారికి ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేకుండా వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కానీ చాలామంది రకరకాల కారణాలతో వ్యాక్సిన్ తీసుకొనేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకే ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్నంగా ఆలోచించన చేస్తుంది. ఇకపై వ్యాక్సిన్ తీసుకోకుండా బయట తిరిగే వారిపై రూ.500 జరిమానా విధించనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. 45 సంవత్సరాలు వయస్సు పైబడినా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నవారిపై ఇది అమలు చేయాలనుకుంటున్నట్టు చెప్తున్నారు.
ఔరంగాబాద్ నగరంలో దాదాపు 17లక్షల జనాభా ఉన్నట్లు అధికారిక లెక్కలున్నాయి. కాగా.. ఇందులో ఇప్పటివరకు కేవలం 3.08లక్షల మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే మొత్తం జనాభాలో 20శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నారు. కానీ, జూన్ చివరి నాటికి కనీసం 5లక్షల మందికి వ్యాక్సిన్ అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ప్రజలలో కొందరు అందుకు సుముఖంగా లేకపోవడంతో అధికారులు పోలీసులతో జరిమానాలు విధించి కఠినంగా వ్యాక్సినేషన్ చేయాలని భావిస్తున్నారు.