Gujarat Assembly Election 2022: డిసెంబరు 1, 5న గుజరాత్ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ ఇవాళ ప్రకటించారు. డిసెంబరు 1, 5న గుజరాత్ ఎన్నికలు నిర్వహిస్తామని, డిసెంబరు 8న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. గుజరాత్ లో మొత్తం 182 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Gujarat Assembly Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ ఇవాళ ప్రకటించారు. డిసెంబరు 1, 5న గుజరాత్ ఎన్నికలు నిర్వహిస్తామని, డిసెంబరు 8న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. కొన్ని రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన రోజే గుజరాత్ ఎన్నికలకు కూడా ప్రకటిస్తారని అందరూ భావించినప్పటికీ, సీఈసీ ఆ పనిచేయలేదన్న విషయం తెలిసిందే. గుజరాత్ లో మొత్తం 182 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉంది. గతంలో బీజేపీ-కాంగ్రెస్ కి మధ్య ప్రధానంగా పోటీ ఉండేది. ప్రస్తుతం గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దీటుగా ప్రచారంలో పాల్గొంటోంది. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. గుజరాత్ ను తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది.

గుజరాత్ మొదటి విడత ఎన్నికల వివరాలు..
నోటిఫికేషన్ విడుదల: నవంబరు 5
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: నవంబరు 14
నామినేషన్ల పరిశీలన: నవంబరు 15
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబరు 17
పోలింగ్ తేదీ: డిసెంబరు 1
ఓట్ల లెక్కింపు: డిసెంబరు 8

రెండో విడత ఎన్నికల వివరాలు..
నోటిఫికేషన్ విడుదల: నవంబరు 10
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: నవంబరు 17
నామినేషన్ల పరిశీలన: నవంబరు 18
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబరు 21
పోలింగ్ తేదీ: డిసెంబరు 5
ఓట్ల లెక్కింపు: డిసెంబరు 8.

ట్రెండింగ్ వార్తలు