Vande Bharat Express Trial Run : దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఇవాళ చెన్నై-మైసూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ ప్రారంభమైంది. చెన్నై MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ఇవాళ ఉదయం 6 గంటలకు బయలుదేరిన వందే భారత్ రైలు.. దాదాపు ఆరున్నర గంటల్లో కవర్ చేస్తూ మధ్యాహ్నం 12:30 గంటలకు మైసూరు చేరుకోనుంది.
నవంబర్ 11న చెన్నై నుంచి బెంగళూరు మీదుగా మైసూరు వరకు వందే భారత్ రైలు సర్వీసును అధికారికంగా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న(KRS) స్టేషన్‌లో ఒకే స్టాప్ హై స్పీడ్ రైలు కలిగి ఉంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు ఆరున్నర గంటల్లో 504 కిలోమీటర్లు ప్రయాణించనుంది.
Third VandeBharat train in the country: దేశంలో అందుబాటులోకి 3వ ‘వందే భారత్ రైలు’.. ప్రారంభించిన మోదీ
బుధవారం మినహా వారానికి ఆరు రోజులు హైస్పీడ్ రైలు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రైలులోని మొత్తం 16 కోచ్‌ల కోచ్‌లలో ఆటోమేటిక్ డోర్లు, GPS-ఆధారిత ఆడియో-విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాల కోసం ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్ Wi-Fi, సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు చేశారు.
ప్రతి కోచ్‌లో వేడి భోజనం, శీతల పానీయాలు అందించడానికి ప్యాంట్రీ అందుబాటులో ఉంది. మార్చి 2023 కల్లా దేశంలో 25 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది.