హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఐటీ ఏరియా బయో డైవర్సిటీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఫస్ట్ లెవల్ ఫ్లై ఓవర్‌ను 2020, మే 21వ తేదీ గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మైండ్‌స్పేస్ అండర్ పాస్, మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్, అయ్యప్ప సొసైటి జంక్షన్ అండర్ పాస్, రాజీవ్‌గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ జంక్షన్ లేవల్ -2 ఫ్లై ఓవర్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక గురువారం నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ లెవల్ -1 ఫ్లై ఓవర్ కూడా అందుబాటులోకి రానుంది. మొత్తం 30 కోట్ల 26 లక్షల వ్యయంతో… 690 మీటర్లు పొడవు, 11.50 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది. గచ్చిబౌలి నుంచి మోహదీపట్నం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఈ వంతెన క్లియర్ చేయనుంది.
బయో డైవర్సిటీ జంక్షన్ లెవల్ 1 ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంతో ఈ ప్యాకేజీలోని మొత్తం పనులు పూర్తయినట్లు, దీనివల్ల గచ్చిబౌలీ నుంచి మొహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయని నగర మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. మూడు లైన్ల ఈ ఫ్లై ఓవర్ పై ఒకే వైపు వాహనాలను అనుమతించనున్నట్లు చెప్పారు.
Read: సాగు భేటీ :పంటల విధానంపై KCR సమీక్ష