‘Dilli Ki Yogshala’..Kejriwal : ఇంటింటికీ వెళ్లి భిక్షమెత్తైనా‘ఉచిత యోగా క్లాసులు’ పథకాన్ని కొనసాగిస్తా : కేజ్రీవాల్

ఇంటింటికీ వెళ్లి భిక్షమెత్తైనా‘ఉచిత యోగా క్లాసులు’ పథకాన్ని కొనసాగిస్తానని ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు.

Dilli Ki Yogshala..Kejriwal

Dilli Ki Yogshala..Kejriwal : ఇంటింటికీ తిరిగి భిక్షం ఎత్తి అయినా ‘దిల్లీ కి యోగశాల(Dilli Ki Yogshala)’ పథకం కొనసాగించి తీరుతాను అంటూ ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచిత యోగా తరగతుల కోసం ప్రవేశపెట్టిన ‘దిల్లీ కి యోగశాల పథకం కొనసాగిస్తానని తెలిపారు సీఎం కేజ్రీవాల్. ఈ క్లాసుల కొనసాగింపు విషయంపై కేజ్రీవాల్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనాకు మధ్య కొత్త వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రజలకు ఉచితంగా అందించే యోగా క్లాసులు నిలిపివేసే ప్రసక్తేలేదని..వీటిని కొనసాగించటానికి తాను ఇంటింటికి వెళ్లి భిక్షం ఎత్తటానికి కూడా సిద్ధమని తెలిపారు కేజ్రీవాల్. లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీలు అడ్డుపడినా.. ఢిల్లీలో తమ ప్రభుత్వం చేపట్టిన ఏ పనులనూ ఆపేది లేదని స్పష్టంచేశారు.

అక్టోబరు 31 తర్వాత యోగా పథకం కొనసాగింపునకు సంబంధించి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం తెలియజేయలేదని ప్రభుత్వ వర్గాలు సోమవారం (అక్టోబర్ 31,2022) పేర్కొన్నాయి. అసలు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫైలు తమకు అందలేదని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సచివాలయ వర్గాలు తెలిపాయి. ఇదే విషయమై కేజ్రీవాల్ అసహనం వ్యక్తంచేశఆరు. దీనికి సంబంధించిన ఫైల్ పై ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా అక్టోబర్ 26నే సంతకం చేశారని..ఆ ఫైలును లెఫ్టినెంట్ గవర్నర్‌కూ పంపినట్లు వెల్లడించారు.

Delhi Govt Online Yoga : కోవిడ్ బాధితుల‌ కోసం ప్రభుత్వం ఆన్‌లైన్‌లో యోగా క్లాసులు

కాగా దిల్లీలో 17 వేల మంది యోగా తరగతులతో లబ్ధి పొందుతున్నారు. వీరిలో చాలా మంది కొవిడ్ నుంచి కోలుకున్నవారే. ఈక్రమంలో అధికార దుర్వినియోగంతో వాటిని నిలిపివేశారు. దీంతో కేజ్రీవాల్ యోగా క్లాసులు నిర్వహించే ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు చేస్తూ..బీజేపీ, లెఫ్టినెంట్‌ గవర్నర్‌లు ఎన్ని కుట్రలు పన్నినా.. ఈ కార్యక్రమాన్ని ఆపబోమని దీనికోసం ఇంటింటికి వెళ్లి యాచించాల్సి వచ్చినా.. దానికి సిద్ధమే. దానికి సంబంధించి యోగా ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన నగదుని చెల్లిస్తామని దయచేసి ఎవ్వరూ యోగా క్లాసులను ఆపకుండా కొనసాగించాలని కోరారు. పంజాబ్ లో తాము అధికారంలోకి వస్తే అక్కడ కూడా ఉచిత యోగా క్లాసులు ప్రారంభిస్తామని ప్రకటించారు కేజ్రీవాల్.