Minister Nitin Gadkari: తెలుగు రాష్ట్రాలకు రూ. 573కోట్లు.. జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తర్ణకు కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో జాతీయ రహదాకుల విస్తరణకు రూ. 573.13 కోట్ల ప్రాజెక్టులను ఆమోదించినట్లు తెలిపారు.

Minister Nitin Gadkari: తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తర్ణకు కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో జాతీయ రహదాకుల విస్తరణకు రూ. 573.13 కోట్ల ప్రాజెక్టులను ఆమోదించినట్లు తెలిపారు. గురువారం ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌హెచ్-163లోని హైదరాబాద్ – భూపాలపట్నం సెక్షన్ విస్తరణ ప్రాజెక్టు కోసం రూ. 136.22 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయించారు.

Nitin Gadkari: నేను మధ్యతరగతి వాడిని, మీ కారు కొనలేను.. బెంజ్ కార్లను ఉద్దేశించి గడ్కరీ ఈసక్తికర వ్యాఖ్యలు

ఈ రహదారి విస్తరణ వల్ల లక్నవరం, బొగత జలపాతం వంటి పర్యాటక ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అంతేకాక, ములుగు జిల్లాలో నక్సల్స్ ప్రభావం ఎక్కువ. దాన్ని నియంత్రణలో ఉంచేందుకు, తెలంగాణ – చత్తీష్‌గఢ్ మధ్య అంతర్రాష్ట్ర కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని గడ్కరీ అన్నారు.

అందేవిధంగా ఎన్‌హెచ్-167కేలో తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రదేశ్ కర్నూల్ ప్రాంతాన్ని కలుపుతూ కొల్లాపూర్‌ వద్ద కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ. 436.91 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా ఎన్‌హెచ్- 167కే హైదరాబాద్ కల్వకుర్తి – తిరుపతి, నంద్యాల చెన్నై వంటి ముఖ్యమైన గమ్యస్థానాల మధ్య దూరం సుమారు 80 కి.మీ తగ్గుతుందని తెలిపారు. నల్లమల ఫారెస్ట్‌కు సమీపంలో నంద్యాల వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులకు ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండటం, కొల్లాపూర్‌లో మంజూరైన ఐకానిక్ బ్రిడ్జి రెండు రాష్ట్రాలకు గేట్‌వే అవుతుందని, పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో దోహదపడుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు.

union minister Nitin Gadkari

వీటితో పాటు హరియాణాలో ఎన్‌హెచ్-148 బీలో భివానీ-హన్సీ సెక్షన్ ను రూ. 1,322.13 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరించే ప్రాజెక్టు‌ను కూడా ఆమోదించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు