Fossils of turtle
Fossils of turtle: కారు అంతటి పరిమాణం ఉండే తాబేళ్లు ఒకప్పుడు జీవించి ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2016లో స్పెయిన్ లోని కోల్ డి నార్గోలోని కాల్ టెర్రాడెస్ లో 2016లో దొరికిన శిలాజాలపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. 3.7 మీటర్ల పొడవు ఉండే ఈ తాబేళ్లు 8.3 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ల కాలంలో ఉండేవని అన్నారు. వీటిని లెవియాథనోచెలిస్ ఎనిగ్మాటికా అని పిలుస్తారు.
ఈ తాబేళ్లు మినీ కూపర్ కారు పరిమాణంలో ఉండేవని శాస్త్రవేత్తలు అన్నారు. ఈ విషయాన్ని గుర్తించి తాను కూడా ఆశ్చర్యపోయామని శాస్త్రవేత్త ఆస్కార్ కాస్టిల్లో అన్నారు. అది శాస్త్రవేత్తలు గుర్తించిన కొత్త జాతి జీవి అని చెప్పారు. ఈశాన్య స్పెయిన్ లో 12 అడుగుల పొడవు, 200 కిలోల బరువుతో ఉన్న తాబేలు శిలాజాన్ని గుర్తించినట్లు చెప్పారు.
ఈ తాబేళ్లకు చాలా బలమైన దవడ ఎముకలు ఉండేవని తెలిపారు. తాబేళ్ల డొప్పలు చాలా పెద్దగా ఉండేవని చెప్పారు. సముద్రంలోని ఇతర భయంకర జీవాలతో పోరాడేందుకు వాటిని వాడుకునేవని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..