Andhra Pradesh: కొత్తగా నలుగురు ఎమ్మెల్సీలు.. పూర్తైన కసరత్తు!

ఏపీలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలు ఎన్నిక కానున్నారు. గవర్నర్ కోటాకింద నియామకం కానున్న ఈ నలుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే ఫైల్ రాజ్ భవన్ కు చేరగా ఈరోజు (జూన్ 12) గవర్నర్ అధికారికంగా ఆమోదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలు ఎన్నిక కానున్నారు. గవర్నర్ కోటాకింద నియామకం కానున్న ఈ నలుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే ఫైల్ రాజ్ భవన్ కు చేరగా ఈరోజు (జూన్ 12) గవర్నర్ అధికారికంగా ఆమోదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న మండలి సభ్యులలో ఈ శుక్రవారంతో నలుగురికి పదవీ కాలం ముగిసింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన టిడి జనార్దన్, బీద రవిచంద్ర, గౌవిగారి శ్రీనివాస్, పి.శమంతకమణికి నిన్నటి (జూన్ 11)తో పదవీ కాలం ముగిసింది.

దీంతో మరో నలుగురికి కొత్తగా ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుంది. గవర్నర్ కోటాలో ఎన్నికయ్యే ఈ సభ్యులకు సాధారణంగా అధికార పార్టీకి చెందిన వారికే అవకాశం ఉండగా ఇప్పటికే వైసీపీ అధిష్టానం సభ్యులను ఎంపిక చేసి లిస్ట్ రాజ్ భవన్ కు పంపింది. ఇందులో మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు, రమేశ్ యాదవ్, లెల్ల అప్పిరెడ్డి పేర్లు ప్రతిపాదించారు. ఈ నలుగురు ఎమ్మెల్సీలుగా నియమితులైనట్లు శనివారం లేదా ఆదివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉండగా ఈ నెల14న.. లేదంటే ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో వీరి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు