Telangana : విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీడీ వ‌ర్క‌ర్స్ కాల‌నీలో విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి చెందారు.

Four People Died Due To Electric Shock In The Same Family

Tragedy in kamareddy district : కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీడీ వ‌ర్క‌ర్స్ కాల‌నీలో విద్యుత్ షాక్ తో న‌లుగురు మృతి చెందారు. కాగా మృతులు హైమ‌ద్,ప‌ర్వీన్ ,మోయిన్,అద్నాన్ గా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన‌వారు కావ‌డంతో బీడీ వర్కర్స్ కాలనీలో తీవ్ర విషాదం నెల‌కొంది.

నీరు విద్యుత్తును పుట్టిస్తుంది. అదే నీరు శత్రువుగా మారి ప్రాణాలు తీస్తుంది. వానాకాలంలో అంతటా తడిగా మారుతుంది. చిత్తడి తీగలు, స్విచ్‌లు, విద్యుత్ మోటార్లు ఇతరత్రా ఉపకరణాలు వాడేవారు జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. విద్యుదాఘాతం, షాట్ సర్కూట్‌ను నివారించాలి. మన్నికైన ఎలక్ట్రికల్ వస్తువులను వాడితే వానాకాలంలో సంభవించే పలు ప్రమాదాలను నివారించవచ్చు. ఈ సీజన్‌లో చిన్నపాటి జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వానాకాలంలో ప్రధానంగా విద్యుత్ వైర్లు, కనెక్షన్లు ఉన్న చోట కొద్దిగా పదును ఉంటే చాలు విద్యుత్ షాక్ తగులుతుంది. ఇలాంటి వాటన్నింటిని సరి చేసుకోవాలి.

ప్రధానంగా ఇళ్ల లో స్విచ్ బోర్టులున్న చోట, బయట ఉండే విద్యుత్ బల్బులు తడుస్తున్న వాటి ద్వారా కూడా ఆ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఇలా ఒక్కొక్కరి ఇళ్లలో గోడలకు కూడా ఎర్త్ వస్తుంది. ఇలాంటి వాటిని నిర్లక్షం చేయకుండా వెంటనే మరమ్మతులు చేయించాలి.