Kejriwal on freebies: ఉచిత విద్య, వైద్యం పేదరికాన్ని తొలగిస్తాయి: ఉచితాలపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు

అమెరికా, కెనడా, జర్మనీ, డెన్మార్క్ ధనిక దేశాలుగా ఎలా మారాయని ఆయన ప్రశ్నించారు. తమ పౌరులకు విద్య, వైద్య సదుపాయాలు సమర్థంగా అందించాయని చెప్పారు. మనమూ ఆ పని చేయాల్సి ఉందని అన్నారు. గతంలో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు అధ్వానంగా ఉండేవని చెప్పారు. చిన్నారులకు సరైన విద్య అందకపోయేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించామని చెప్పారు.

Kejriwal on freebies: ‘ఉచితాల’పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. ‘ఉచితాలు’ ప్రకటించడం సరికాదని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఉచిత విద్య, వైద్యాన్ని ఉచితాలు అని అనరని, ఆ రెండూ పేదరికాన్ని తొలగిస్తాయని కేజ్రీవాల్ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఛత్రసాల్ స్టేడియంలో జెండా వందనం కార్యక్రమం అనంతరం కేజ్రీవాల్ ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా వైద్యం, పాఠశాల విద్యను ఐదేళ్ళలో పునరుద్ధరించాలని ఆయన చెప్పారు.

దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపై నడిచి, భారత్ ను ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. మనమంతా ఒక్కటై బిటిషర్లను వెళ్ళగొట్టామని చెప్పారు. ఇప్పుడు కూడా ఐక్యంగా ముందుకు వెళ్తే భారత్ ను అగ్రరాజ్యంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు భారత్ కంటే ఆలస్యంగా స్వాతంత్ర్యం సాధించి, మన దేశం కంటే అధికంగా అభివృద్ధి సాధించాయని చెప్పారు. ధనిక దేశంగా మారాలంటే విద్య, వైద్య రంగాలు ఎంతో కీలకమని అన్నారు.

అమెరికా, కెనడా, జర్మనీ, డెన్మార్క్ ధనిక దేశాలుగా ఎలా మారాయని ఆయన ప్రశ్నించారు. తమ పౌరులకు విద్య, వైద్య సదుపాయాలు సమర్థంగా అందించాయని చెప్పారు. మనమూ ఆ పని చేయాల్సి ఉందని అన్నారు. గతంలో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు అధ్వానంగా ఉండేవని చెప్పారు. చిన్నారులకు సరైన విద్య అందకపోయేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించామని చెప్పారు.

China-Taiwan conflict: తైవాన్ చుట్టూ మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపడతాం.. చైనా ప్రకటన

ట్రెండింగ్ వార్తలు