SC serious on freebies: ఉచితాలపై సుప్రీం కన్నెర్ర

ఉచితాల సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని వారం క్రితం కోర్టు కొద్ది రోజుల క్రితం అభిప్రాయపడింది. కమిటీలో ఫైనాన్స్ కమిషన్, నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంక్, లా కమిషన్, రాజకీయ పార్టీలతోపాటు ఇతర పార్టీల ప్రతినిధులు ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉచిత పథకాలను నిలిపివేయడానికి సంబంధించి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్... కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పిటిషనర్ అయిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ నుంచి సలహాలు ఆహ్వానించింది

SC serious on freebies: ఎన్నికల్లో లబ్ది పొందేందుకు రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాల హామీలపై సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. దీనిని ఎవరూ సమస్యగా తీసుకోవడం లేదని, అయితే ఇది చాలా తీవ్రమైన సమస్యని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఉచిత పథకాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థలకు భారీ నష్టం వాటిల్లుతోందనే వాదనలు ఒకవైపు.. ప్రజలు చెల్లించిన డబ్బును ప్రజల సంక్షేమానికి ఉపయోగించడంలో తప్పేంటనే వాదనలు మరొకవైపు.. వాడీవేడీగా ఉన్న ఈ చర్చల నడుమ సుప్రీం ఈ విషయమై విచారణ చేపట్టడం ఆసక్తికరంగా మారింది.

‘‘ప్రజల సంక్షేమాన్ని చూస్తూనే ఆర్థిక వ్యవస్థ నష్టపోకుండా చూడాలి. ఈ రెండూ సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. దానికి ఈ చర్చ చాలా ఉపయోగపడుతుంది. కాస్త ఆలోచించేలా చేస్తుంది’’ అని సీజేఐ అన్నారు. రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను కట్టడి చేయాలంటూ భారతీయ జనతా పార్టీ నేత, అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్ కొద్ది రోజులుగా సుప్రీం విచారణలో ఉంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం పలుమార్లు ప్రశ్నించింది, వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Supreme Court :‘నువ్వు వీరుడివే కావొచ్చు..కానీ అగ్నివీరుడివి కాదు’ సుప్రీంకోర్టు జడ్జి-లాయర్ మధ్యఆసక్తికర సంభాషణ

ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ ‘‘దీన్నెవరూ సమస్యగా చెప్పడం లేదు. ఇది చాలా తీవ్రమైన సమస్య. మనది సంక్షేమ రాజ్యం కాబట్టి, ప్రయోజనాలు పొందుతున్న వారికి ఆ ప్రయోజనాలు కావాలి. పన్నులు చెల్లిస్తున్నవారికి అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఖర్చు చేస్తున్నారని అంటే అనవచ్చు. కానీ ఇది తీవ్రమైన సమస్య. ఇరు పక్షాల నుంచి తమ వాదనలు వినిపించాలి’’ అసి అన్నారు. ఉచిత పథకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని ఆగస్టు 3న సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై నిషేధం విధించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ అభిప్రాయాన్ని కూడా కోర్టు కోరింది. ఉచిత పథకాలపై దాఖలైన పిటిషన్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇంకా సీజేఐ మాట్లాడుతూ ‘‘సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, మీడియాలో వస్తున్న కథనాలను ఎలా విస్మరించగలం? ఈ విషయంలో మనం ఎంత వరకు చొరవ తీసుకోగలం అనేది అసలు ప్రశ్న. ఇది ప్రజల తరుపున పరిగణలోకి తీసుకోవాలనే జ్ణానం మనకు ఉండాలి. ఇతర దేశాల నుంచి మనం ఆర్థిక క్రమ శిక్షణ నేర్చుకోవాలి. ఉచితాలు, సంక్షేమ పథకాలు రెండూ వేరు వేరు. భారతదేశం పేదరిక దేశం. ప్రభుత్వం కూడా ఆకలితో అలమటించే ప్రజల కోసం అనే ప్రణాళికలు రచిస్తోంది’’ అని అన్నారు. . తన పదవీ విరమణ దగ్గరలోనే ఉందని, దయచేసి తొందరగా రిపోర్ట్ ఇవ్వాలని సీజేఐ కోరారు.

ఉచితాల సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని వారం క్రితం కోర్టు కొద్ది రోజుల క్రితం అభిప్రాయపడింది. కమిటీలో ఫైనాన్స్ కమిషన్, నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంక్, లా కమిషన్, రాజకీయ పార్టీలతోపాటు ఇతర పార్టీల ప్రతినిధులు ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉచిత పథకాలను నిలిపివేయడానికి సంబంధించి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్… కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పిటిషనర్ అయిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ నుంచి సలహాలు ఆహ్వానించింది. దీని కోసం 7 రోజుల గడువు ఇచ్చింది. ఈ గడువు ఈరోజుతో ముగియడంతో సుప్రీం మరోసారి విచారణ చేపట్టింది. ఈ రోజు విచారణలో ఈ అంశాన్ని సైతం సీజేఐ లేవనెత్తారు.

Supreme Court: పొలిటికల్ పార్టీలు తాయిలాలు పంచడం లంచం లాంటిదే

ట్రెండింగ్ వార్తలు