Supreme Court: పొలిటికల్ పార్టీలు తాయిలాలు పంచడం లంచం లాంటిదే

ఎన్నికల్లో ఓట్లకోసం రాజకీయ పార్టీల ఇచ్చే ఉచిత హామీలపై విచారణ జరపనుంది సుప్రీం కోర్టు. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తుండటానికి వ్యతిరేకంగా న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టింది.

Supreme Court: పొలిటికల్ పార్టీలు తాయిలాలు పంచడం లంచం లాంటిదే

AAP on 'Freebies'

 

Supreme Court: ఎన్నికల్లో ఓట్లకోసం రాజకీయ పార్టీల ఇచ్చే ఉచిత హామీలపై విచారణ జరపనుంది సుప్రీం కోర్టు. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తుండటానికి వ్యతిరేకంగా న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టింది.

ఉచిత హామీలిస్తూపోతే ఇండియా కూడా శ్రీలంకలా తయారవుతుందని పిల్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో కొనసాగడానికి ప్రజాధనంతో తాయిలాలు ప్రకటించడం ఓటర్లకు లంచం ఇవ్వడం లాంటిదేనని, అది అనైతికమని పిటిషనర్ పేర్కొన్నారు.

అసంబద్ధమైన ఉచిత హామీలు ఇచ్చే పార్టీల చిహ్నాలను స్తంభింపజేసి, నమోదును రద్దు చేసేందుకు ఉన్న అధికారాలను ఈసీ వాడేలా చూడాలని సుప్రీంకోర్టును కోరారు.

దీనిపై స్పందించిన సుప్రీం కోర్ట్.. “ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అసంబద్ధమైన హామీలు ఇవ్వడం తీవ్రమైన అంశం. వీటిపై నిర్ణయం తీసుకొనేందుకు కేంద్రం ఎందుకు వెనుకాడుతోంది. వారం రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వ వైఖరేంటో తెలియజేయాలి” అని వెల్లడించింది.

Read Also: అధిక ఫీజుల వల్లే విదేశాలకు విద్యార్థులు: సుప్రీం కోర్టు

ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలను నియంత్రించలేమని ఎన్నికల సంఘం చెప్పిన నేపథ్యంలో ఆర్థిక సంఘం అభిప్రాయాన్ని తీసుకోకూడదా అని కేంద్రాన్ని ప్రశ్నించారు సీజేఐ. కేంద్ర ప్రభుత్వం దీనిని తీవ్రమైన విషయంగా పరిగణించడం లేదా.. వీటిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఈసీ ఎందుకు చెప్పడం లేదని వివరణ కోరారు.

సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఆర్ధిక సంఘం అభిప్రాయం కోరవచ్చు గానీ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని ఆశించలేమన్నారు. అది సాధ్యం కాదని అలా చేయడం వల్ల రాజకీయ అంశాన్ని రేకెత్తిస్తుందన్నట్లుగా అవుతుందని సిబల్ పేర్కొన్నారు.

కేంద్రం నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఈ ఉచితాలు కొనసాగాలా, వద్దా అనేది మేం నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అసంబద్ధ ఉచిత హామీలపై సవివరంగా వారం రోజుల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని సీజేఐ ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ఆర్థిక సంఘంతో మాట్లాడాలని కేంద్రానికి సూచిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.