supreme court: అధిక ఫీజుల వల్లే విదేశాలకు విద్యార్థులు: సుప్రీం కోర్టు

విద్యావ్యవస్థ ఈ దేశంలో ఒక పెద్ద పరిశ్రమగా మారిందని, చాలా మంది విద్యార్థులు మెడిసిన్ లాంటి కోర్సులకు ఫీజులు చెల్లించేలేకే ఉక్రెయిన్ వంటి విదేశాలకు వెళ్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

supreme court: అధిక ఫీజుల వల్లే విదేశాలకు విద్యార్థులు: సుప్రీం కోర్టు

Supreme Court

supreme court: విద్యావ్యవస్థ ఈ దేశంలో ఒక పెద్ద పరిశ్రమగా మారిందని, చాలా మంది విద్యార్థులు మెడిసిన్ లాంటి కోర్సులకు ఫీజులు చెల్లించేలేకే ఉక్రెయిన్ వంటి విదేశాలకు వెళ్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రష్యా-ఉక్రెయిన్ వార్ కారణంగా దాదాపు ఇరవై వేల మంది భారతీయ విద్యార్థులు ఆ దేశం నుంచి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో తిరిగి విద్యా సంస్థలు ప్రారంభమయ్యే పరిస్థితి లేదు.

Maggi Noodles: రోజూ మ్యాగీ చేసిపెట్టిన భార్య.. విడాకులిచ్చిన భర్త

దీంతో చదువు మధ్యలో ఆపేసి ఇండియా వచ్చిన చాలా మంది విద్యార్థులు, తమకు ఇక్కడి కాలేజీల్లోనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమ భవిష్యత్ అంధకారమవుతుందని, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అయినా తమకు ఇక్కడ చదువుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. తాజాగా, ఈ అంశంపై ఉక్రెయిన్‌లో చదువుకుని వచ్చిన ఫార్మసీ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం తగినన్ని ఫార్మసీ కాలేజీలు ఏర్పాటు చేసి, తమకు అవకాశం కల్పించేలా చూడాలని కోరుతూ పిటిషన్‌లో కోరారు. కాగా, ఫార్మసీ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండటంపై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ), కొత్త ఫార్మసీ కాలేజీల ఏర్పాటుపై 2019లో మారటోరియం విధించింది. దీని ప్రకారం ఐదేళ్ల వరకు దేశంలో కొత్తగా ఫార్మసీ కాలేజీలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. అయితే, కోర్టు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టినా, పీసీఐ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. ఇప్పటికే దేశంలో 2,500 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయని పీసీఐ చెప్పింది.

Mamata Banerjee: బీజేపీకి 2024లో నో ఎంట్రీ: మమతా బెనర్జీ

దీనిపై ఇంకా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని పీసీఐ సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చింది. కాగా, తాము కొత్త కాలేజీల ఏర్పాటు విషయంపై తుది తీర్పు ఇచ్చే లోపు కొత్త కాలేజీల ఏర్పాటు కోసం చేసుకున్నదరఖాస్తులను పరిశీలించాలి అని పీసీఐకి సుప్రీంకోర్టు సూచించింది. ఆలోపు కాలేజీలకు అనుమతుల్ని పరిశీలించాలని కోరింది. ‘‘దేశంలో కాలేజీలు పరిశ్రమల్లా మారుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు షాపింగ్ మాల్స్‌లాగా ఎలా మారిపోయాయో మాకు తెలుసు. కొత్త కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండటాన్ని మేం అభినందిస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కాలేజీల ఏర్పాటు ప్ర్రక్రియ పూర్తి చేయాలి’’ అని పీసీఐకి సూచించింది.