Maggi Noodles: రోజూ మ్యాగీ చేసిపెట్టిన భార్య.. విడాకులిచ్చిన భర్త

ఈ రోజుల్లో ఆకలేసినప్పుడు ఈజీగా చేసుకుని తినగలిగేది ఇన్‌స్టంట్ నూడిల్స్ మాత్రమే. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకుని తినేయొచ్చు. అప్పుడప్పుడూ అయితే ఒకే.. కానీ, రోజూ నూడిల్సే తినాలి అంటే ఎవరికైనా కష్టమే

Maggi Noodles: రోజూ మ్యాగీ చేసిపెట్టిన భార్య.. విడాకులిచ్చిన భర్త

Maggi Noodles

Maggi Noodles: ఈ రోజుల్లో ఆకలేసినప్పుడు ఈజీగా చేసుకుని తినగలిగేది ఇన్‌స్టంట్ నూడిల్స్ మాత్రమే. ఈ విషయంలో మ్యాగీ నూడిల్స్ ముందుంటాయి. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకుని తినేయొచ్చు. అప్పుడప్పుడూ అయితే ఒకే.. కానీ, రోజూ నూడిల్సే తినాలి అంటే ఎవరికైనా కష్టమే. ఇలా ఒక వ్యక్తికి అతడి భార్య రోజూ మ్యాగీ నూడిల్సే చేసి పెడుతుండేది.

Mamata Banerjee: బీజేపీకి 2024లో నో ఎంట్రీ: మమతా బెనర్జీ

దీంతో చిరాకొచ్చిన అతడు, ఏకంగా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. కర్ణాటకలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్ట్ జడ్జ్ ఎమ్.ఎల్.రఘునాథ్.. ఇటీవల దేశంలో చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్న జంటలు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తను బళ్లారి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేసినప్పుడు వచ్చిన ఒక విడాకుల కేసు గురించి వివరించారు. ‘మ్యాగీ కేసు’గా పిలిచే ఈ కేసు గురించి ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. బళ్లారి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ కేసు దాఖలు చేశారు. తన భార్యకు మ్యాగీ తప్ప ఇంకేం వంట చేయడం రాదని, అందువల్ల ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టును కోరాడు. నిజంగానే అతడి భార్యకు వంట చేయడం రాదు.

Pawan Kalyan : హరిహర వీరమల్లు ఏమైంది?? షూటింగ్ ఎప్పుడు??

ఎలాంటి వంట చేయలేకపోవడంతో ఎప్పుడూ మ్యాగీ నూడిల్స్ మాత్రమే చేసేది. షాపింగ్‌కు వెళ్తే నూడిల్స్ ప్యాకెట్లు మాత్రమే కొనుక్కొచ్చేది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఇలా అన్నిసార్లూ మ్యాగీ నూడిల్సే చేసిపెట్టేది. దీంతో విసుగొచ్చిన ఆమె భర్త.. తన నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. కోర్టు ఆదేశాల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ, ఇద్దరిమధ్య రాజీ కుదరలేదు. దీంతో ఇరువురూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.