Ganta Srinivasa Rao: ప్రభుత్వ చేతకానితనంతోనే పరీక్షా ఫలితాల విడుదల వాయిదా: గంటా శ్రీనివాసరావు

ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన సమయానికి విడుదల చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనమే అని విమర్శించారు విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా వేయడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు.

Ganta Srinivasa Rao: ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన సమయానికి విడుదల చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనమే అని విమర్శించారు విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా వేయడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. పదో పరగతి పరీక్షా ఫలితాలను చివరి నిమిషంలో వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘గతంలో పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాల తేదీని కూడా అకడమిక్ క్యాలెండర్‌లోనే పొందుపరిచే వాళ్ళం? కచ్చితంగా అమలుచేసే వాళ్ళం. ఇప్పుడెందుకు అలా చేయలేకపోతున్నారు? వివరించగలరా! ఇంతకీ ఫలితాల వాయిదాకి కారణం ఎంటి? అసమర్ధతా? ఇంకేమైనా లోపాయికారీ వ్యవహారాలా?

Nayan-Vignesh : నయన్, విగ్నేష్ పెళ్లి.. తమిళనాడు సీఎంకి ప్రత్యేక ఆహ్వానం అందించిన జంట..

విడుదల రోజే లోపం ఎక్కడ జరిగింది? దీనికి బాధ్యత ఎవరిది? గ్రేడ్‌లు తీసి మార్కులు ప్రకటిస్తామని చెప్పారు సరే.. అది ప్రభుత్వ విధానం అనుకుందాం.. అందులో తప్పొప్పుల ప్రస్తావన పక్కన పెడదాం. కనీసం ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించి ఇలాంటి పరీక్షా ఫలితాల విడుదలనూ సకాలంలో చేయలేకపోతే ఇక మీపై భరోసా ఎలా ఉంటుంది? కనీసం మీకు మీరు సమర్థించుకో గలరా?’’ అని గంటా ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు