Garuda Seva : ఆగస్టులో శ్రీవారికి రెండుసార్లు గరుడసేవ..విశిష్టత ఏంటంటే?…

ఆగస్టు 13వతేదిన గరుడ పంచమి సందర్భంగా మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగనుండగా ఆగస్టు 22వ తేదిన శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా గరుడవాహనంపై స్వామి వారిని నాలుగు మాడవీధుల్లో ఊరేగించనున్నారు.

Garuda Seva : తిరుమలలో శ్రీవారికి నిర్వహించే వాహన సేవల్లో గరుడ సేవకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సేవలో పాల్గొనేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. శ్రీవారి వాహన సేవకుల్లో అగ్రగణ్యుడు గరుత్మంతుడు. ఏటా తిరుమలలో గరుడపంచమిని ఘనంగా నిర్వహిస్తారు. ఆగస్టులో రెండు సార్లు గరుడ వాహనంపై స్వామి వారిని ఊరేగించనున్నారు.

ఆగస్టు 13వతేదిన గరుడ పంచమి సందర్భంగా మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగనుండగా ఆగస్టు 22వ తేదిన శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా గరుడవాహనంపై స్వామి వారిని నాలుగు మాడవీధుల్లో ఊరేగించనున్నారు. వాస్తవానికి ప్రతినెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ నిర్వహిస్తారు. అయితే ఆగస్టు 22న శ్రావణ పౌర్ణమి కావటంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

ఆగస్టు 13న జరగనున్న గరుడ పంచమి చాలా విశిష్టమైనది. కొత్త దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందమయంగా ఉండేందుకు, మహిళలు పుట్టే సంతానం గరుడునిలా బలశాలిగా , మంచి వ్యక్తిత్వం కలవారిగా ఉండాలని గరుడ పంచమి పూజలు చేస్తారు. శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్పభయంలేకుండా ఆరోజున నాగపూజ చేస్తారు.

ఆగస్టు 13 వ తేదిన జరగనున్న గరుడ పంచమి సందర్భంగా స్వామి వారు రాత్రి 7గంటల నుండి 9గంటల వరకు స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగిస్తారు. ఆగస్టు 22వ తేది శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాత్రి 7గంటల నుండి 9 గంటల వరకు నాలుగు మాడవీధుల్లో గరుడ వాహన ఊరేగింపు కొనసాగనుంది.

 

ట్రెండింగ్ వార్తలు