Real Hero : ఎవరెస్ట్ డెత్ జోన్ నుంచి క్లైంబర్‌ను కాపాడిన నేపాలీకి సెల్యూట్ చేస్తున్న నెటిజన్లు

ఎవరెస్టు అధిరోహించాలంటే ధైర్య, సాహసాలు కావాలి. అలా ఎక్కేవారిలో కొందరు అనుకోకుండా అనారోగ్యాల బారిన పడిపోతుంటారు. ఓ మలేషియా క్లైంబర్ డెత్ జోన్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉండగా చూసిన నేపాలీ వ్యక్తి ఎంతో సాహసం చేసి అతని ప్రాణాలు కాపాడాడు. అందరి మన్ననలు అందుకుంటున్నాడు.

Sherpa saved the climber : గెల్జే షెర్పా అనే నేపాలీ మౌంట్ ఎవరెస్ట్ డెత్ జోన్‌లో ఓ పర్వతారోహకుడు చిక్కుకుపోయి ఉండటం గమనించాడు. వెంటనే అతడిని రక్షించి శిబిరానికి తీసుకెళ్లాడు. అతని సాహసానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.

Mount Everest : ఎవరెస్టు శిఖరమా? డంపింగ్ యార్డా? .. ఐఏఎస్ ఆఫీసర్ షేర్ చేసిన వీడియో వైరల్

గెల్జే షెర్పా అనే 36 ఏళ్ల వ్యక్తి ఎవరెస్ట్ శిఖరాగ్రానికి వెళ్లడానికి క్లైంబర్స్‌కి సూచనలు చెబుతున్నాడు. అప్పుడు వారంతా 8,300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నారు. అదే సమయంలో షెర్పా దృష్టి డెత్ జోన్‌లో ఉన్న మలేషియా పర్వతారోహకుడి‌పై పడింది. అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు షెర్పా గమనించాడు. అతను ఒంటరిగా చనిపోకుండా సాయం అందించాలని డిసైడయ్యాడు. ఒక్క నిముషం ఆలస్యం చేయకుండా తను చేస్తున్నపనిని విడిచిపెట్టి పర్వతారోహకుడిని శిబిరం నుంచి తీసుకురావడానికి బయలుదేరాడు.

 

ఎంతో శక్తి, సహనంతో షెర్పా 6 గంటలపాటు శ్రమించి ఆ క్లైంబర్‌ని క్యాంపు 4 వరకు మోసుకుని తీసుకెళ్లాడు. అక్కడి నుంచి రెస్క్యూ టీం సాయం చేసింది. ‘ ఒక భారీ పని నుండి శక్తిని పుంజుకున్న తర్వాత నేను త్వరలో తిరిగి పర్వతం పైకి వస్తాను. అతను ప్రాణాలతో ఉన్నాడని.. ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని చెప్పడానికి సంతోషిస్తున్నానని ‘ అని షెర్పా తన ఇన్‌స్టాగ్రామ్ gelje_sherpa అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సైతం షెర్పా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Mt Everest : ఆమె గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి.. పేస్‌మేకర్‌తో ఎవరెస్టు ఎక్కి రికార్డ్ కొట్టాలనుకుంది.. చివరికి..

షెర్పా చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు అందుకున్నాడు. ‘నిజ జీవిత హీరోకి సెల్యూట్’ అని ఒకరు.. ‘ఆ దారిలో ఒకరు నడవడమే కష్టం.. అలాంటిది మీరు ఇంకొకరిని తీసుకెళ్లి ప్రాణాలు కాపాడటం.. వావ్’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
షెర్పా మౌంట్ ఎవరెస్ట్ యొక్క ప్రమాదకరమైన “డెత్ జోన్”లో సాహసం చేశాడని చెప్పాలి. అందుకే అందరి మన్ననలు అందుకుంటున్నాడు.

ట్రెండింగ్ వార్తలు