GHMC Election Schedule Release : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగారా మోగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు మంగళవారం (నవంబర్ 17,2020) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి విడుదల చేశారు. రేపటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. నవంబర్ 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని పేర్కొన్నారు.
డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ని ర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3న అవసరమైతే రీపోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 4న కౌంటింగ్ ఉంటుందని తెలిపారు.
గ్రేటర్ లో ఎన్నికల కోడ్ అమలు ఉందని తెలిపారు.
నామినేషన్ దాఖలుకు జనరల్ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2500 డిపాజిట్ చేయాలని సూచించారు. ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందన్నారు. 48 వేల మంది సిబ్బందితో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రేటర్ పరిధిలో 9,248 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో 1,439 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. 1,004 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు చెప్పారు. 257 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.
జీహెచ్ఎంసీలో 74,04,286 మంది ఓటర్లు ఉండగా 38,56,770 మంది పురుష ఓటర్లు, 35,46,847 మంది మహిళా ఓటర్లు, 669 మంది ఇతర ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలోని 150 వార్డులకు ఎన్నికలు జరుగున్నాయని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్ తో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టామని విరించారు.
జీహెచ్ఎంసీ మేయర్ పదవి మహిళ (జనరల్)
ఎస్టీ-2
ఎస్సీ-10
బీసీ-50
జనరల్ మహిళ-44
జనరల్-44
నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 20 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు
నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన
నవంబర్ 22న నామినేషన్ల ఉపసంహరణ
డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు
డిసెంబర్ 3న అవసరన ప్రాంతాల్లో రీపోలింగ్
డిసెంబర్ 4న కౌంటింగ్