Liquor Museum : గోవాలో లిక్కర్ మ్యూజియం..ఘాటైన ’ఫెనీ‘ వెరీ స్పెషల్

గోవాలో లిక్కర్ మ్యూజియం ఏర్పాటైంది. ఇటువంటి మ్యూజియం దేశంలో మొదటిది కావటం విశేషం.గోవా స్పెషల్ అయిన ఫెనీ మద్యం మరో స్పెషల్ అట్రాక్షన్ .

Liquor Museum in Goa : గోవా. అందమైన బీచ్ లకే కాదు మద్యం తాగటానికి ఎంజాయ్ చేయటానికి చక్కటి టూరిస్టు ప్లేస్. ఎంతోమంది మందుబాబులు మద్యంతో ఎంజాయ్ చేయటానికే గోవా వెళతారు. భారత్ వచ్చే విదేశీయుల్లో అత్యధికులు గోవా వెళ్లకుండా తిరిగివెళ్లరు. గోవా సంస్కృతి కూడా పాశ్చాత్యదేశాల సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. పర్యాటకంగా చాలా ప్రసిద్ది చెందిన గోవాలో తాజాగా ఓ లిక్కర్ మ్యూజియం ఏర్పాటైంది. భారత్ లో లిక్కర్ కు మ్యూజియం ఏర్పాటు ఇదే తొలిసారి కావటం అదికూడా మద్యానికి మారుపేరు అయిన గోవాలో ఏర్పాటు కావటం విశేషం. ‘All About Alcohol’ పేరుతో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు.

ఉత్తర గోవాలోని కండోలిమ్ గ్రామంలో నందన్ కుచాద్కర్ అనే స్థానిక వ్యాపారవేత్త ఈ లిక్కర్ మ్యూజియం ఏర్పాటు చేశారు. గోవాలో స్థానికంగా ఫెనీ అనే మద్యాన్ని తయారుచేస్తారు. జీడిమామిడి పండ్లతో యారుచేసే ఫెనీ మద్యం ఎంతో టేస్ట్ గా ఉంటుందనే పేరుంది. ఒకరకంగా ఫెనీ మద్యం గోవాకు వారసత్వ సంపద అనే చెప్పాలి. అందుకే ఈ మ్యూజియంలో ఫెనీ తయారీకి ఉపయోగించే వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. ఫెనీ మద్యం నిల్వకు ఉపయోగించే భారీ పాత్రలు కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయటం విశేషం.నందన్ కుచాద్కర్ కు పురాతన కళాఖండాల సేకరించటంఅంటే చాలా ఇష్టం. అదోక హాబీ ఆయనకు. ఈ హాబీలో భాగంగా నందన్ వందల ఏళ్ల నాటి ఫెనీ తయారీ ఉపకరణాలను కూడా సేకరించి ఈ లిక్కర్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. వీటిలో 1950కాలం నాటివి కూడా ఉన్నాయి.

Read more : Threat vaccination staff with snake : ‘నాకు వ్యాక్సిన్ వేసారో..పాముతో కరిపిస్తా జాగ్రత్త’ : మహిళ బెదిరింపు

లిక్కర్ మ్యూజియం ఏర్పాటు గురించి వ్యాపారవేత్త నందన్ కుచాద్కర్ మాట్లాడుతు..ఇటువంటి ఓ మ్యూజియం స్థాపించాలన్న ఆలోచన రాగానే, ప్రపంచంలో ఇటువంటి మ్యూజియం ఇంకెక్కడైనా ఉందా? అని వివరాలు సేకరించాను. స్కాట్లాండ్, రష్యా దేశాల్లో ప్రజలు తమ వద్ద ఉన్న మద్యాన్ని సంతోషంగా ప్రదర్శిస్తుంటారని..కానీ ఓ మ్యూజియాన్ని లిక్కర్ కోసం ఏర్పాటు చేయడం ఇదే ఫస్టు టైమ్.

మ్యూజియం సీఈఓ అర్మాండో డువార్టే మాట్లాడుతూ..గోవాకు టూరిస్టులు వచ్చినప్పుడు మద్యంతో విందు చేసుకోవటం ఎంజాయ్ చేసుకోవటం అనేది సర్వసాధారణ విషయం. అది గోవా సంప్రదాయం కూడా అని తెలిపారు.కాగా..ఈ లిక్కర్ మ్యూజియంను సందర్శించిన ఓ పర్యాటకు ఆనందాశ్చర్యాలు వ్యక్తంచేశాడు. మద్యం గురించి ఇక్కడ చక్కటి సమాచారంఇవ్వటం పలు రకాల లిక్కర్ బాటిల్స్ఒకేచోట ఉండటం చాలా అద్భుతమంటూ ప్రశంసించాడు.

ట్రెండింగ్ వార్తలు