Goat Kneels Down AT Temple : దేవుడికి హారతి ఇస్తుండగా ముందుకాళ్లతో మోకరిల్లిన మేక

దేవాలయంలో దేవుడికి హారతి ఇస్తుండగా ముందుకాళ్లతో మోకరిల్లిన మేక వీడియో వైరల్ అవుతోంది.

Goat Kneels Down at Temple

Goat Kneels Down AT Temple : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. దేవుడికి హారతి ఇస్తున్న సమయంలో భక్తులంతా భగవంతుడికి నమస్కరించి నిలుచున్న సమయంలో ఓ మేక కూడా తన భక్తిని చాటుకుంది. ఓ మేక దేవుడికి హారతి ఇస్తుండగా తన ముందుకాళ్లతో మోకరిల్లి దేవుడిని ప్రార్థించింది. మేక భక్తిని చాటుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గంగా నది తీరంలోని పురాతన శివాలయంలోని శివుడ్ని బాబా ఆనందేశ్వర్‌గా భక్తులు కొలుస్తారు. ఇటీవల ఈ ఆలయం వద్దకు ఓ మేక వచ్చింది. ఆలయంలోని పూజారులు సాయంత్రం వేళ దేవుడికి హారతి ఇచ్చి మంత్రాలు చదువుతున్నారు. దీంతో అక్కడి భక్తులు భక్తి భావంతో మోకరిల్లి దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో ఓ మేక కూడా తన భక్తిని చాటుకుంది. భక్తులతోపాటుఆ మేక కూడా హారతి ఇస్తున్న సమయంలో మేళ తాళాలను ఎంతో శ్రద్ధగావిన్నది. తరువాత ముందు కాళ్లతో ఆలయం మెట్ల వద్ద మోకరిల్లింది. హారతి జరుగుతున్నంత సేపు తల వంచి ప్రార్థన చేస్తునే ఉంది. ఇది చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు.

డేవిడ్ జాన్సన్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్‌లో ఆదివారం పోస్ట్‌ చేయటంతో మేక భక్తి అందరికి తెలిసి వైరల్ అవుతోంది. ‘కాన్పూర్‌లోని పరమాత్మ ఆలయం నుంచి వెలువడిన ఒక అద్భుతమైన భక్తి భావ దృశ్యం ఇది. బాబా ఆనందేశ్వరుడికి హారతి ఇస్తున్న సమయంలో ఒక మేక భక్తితో మోకరిల్లినట్లు కనిపించింది’ అని పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మరి ఆ మేక భక్తి వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండీ..