Gold Rate Today : బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా? స్వల్పంగా తగ్గిన వెండి ధర
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
- Harishth Thanniru
- Published On : November 19, 2023 / 07:41 AM IST
Gold
Today Gold and Silver Rate : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి స్వల్ప ఊరట. దీపావళి పండుగకు ముందు వరకు తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర.. పండుగ తరువాత ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. గత మూడు రోజుల్లోనే తులం బంగారంపై రూ. 1100 పెరిగింది. అయితే, ఆదివారం బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు గడిచిన నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ. 4,100 పెరగ్గా.. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,550 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 61,690కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం (రూ. 50 తగ్గింది) రూ. 61,790.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690 కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,000 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.62,180.
స్వల్పంగా తగ్గిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గింది. దీంతో ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 79,000 కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 79,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.76,000 కు చేరింది. బెంగళూరులో కిలో వెండిపై రూ. 250 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రూ.75,250 కు చేరింది.
