ఆండ్రాయిడ్, iOS డివైజ్‌ల్లో ‘గూగుల్ మీట్’ Gmail ఇంటిగ్రేషన్ రాబోతోంది

  • Publish Date - June 17, 2020 / 04:53 PM IST

గూగుల్ వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసు ‘గూగుల్ మీట్’ త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ జిమెయిల్ యాప్‌లో రాబోతోంది. దీనికి సంబంధించి గూగుల్ ఖచ్చితమైన తేదీని వెల్లడించలేదు. దాదాపు నెల రోజుల తర్వాత గూగుల్ మీట్ Tabను జిమెయిల్ వెబ్ క్లయింట్‌లో కంపెనీ చేర్చింది.

Gmail యాప్‌లోని Meet Tab వెబ్ వెర్షన్ మాదిరిగానే యూజర్లు మీట్ కాల్‌లో చేరడానికి లేదా ప్రారంభించడానికి అనుమతిస్తుంది. గూగుల్ క్యాలెండర్‌తో ఒకదాన్ని షెడ్యూల్ చేసే ఎంపిక ఉండగా, ఇప్పుడు యూజర్లు రాబోయే మీట్ కాల్‌లను కూడా చూడొచ్చు. కరోనావైరస్ మహమ్మారి ఉన్నప్పటికీ గూగుల్ మీట్‌లో చాలా అప్‌డేట్‌లు వచ్చాయి. 

గూగుల్ క్యాలెండర్‌లోని మీట్ బటన్‌పై క్లిక్ చేయొచ్చు లేదా ఇమెయిల్, గూగుల్ చాట్ ద్వారా కనెక్ట్ బటన్ ద్వారా యూజర్లు Gmail Android లేదా iOS యాప్‌తో సమావేశాలకు హాజరుకావచ్చని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. Gmail యాప్‌లో వీడియో కాల్‌ ద్వారానే మీట్ యాప్ వలే పనిచేస్తుంది. Gmail యాప్‌తో లింక్ తర్వాత, వీడియో కాల్‌లో జాయిన్ అవ్వాలంటే యూజర్లకు ప్రత్యేకమైన Google మీట్ యాప్ అవసరం లేదు.

కాల్ ఎంటర్ చెయ్యడానికి యూజర్ Meet బటన్‌ను Tap చేస్తే సరిపోతుంది. ఫోన్‌లో మైక్రోఫోన్, కెమెరాను యాక్సెస్ చేయడానికి Gmail యాప్ అనుమతినిస్తుంది. వీడియో కాల్ సమయంలో, యూజర్లు రోజువారీ మీట్ ప్రోగ్రామ్‌లో మాదిరిగానే కెమెరా, మైక్రోఫోన్‌ను On /Off చేస్తారు.

Gmail యాప్ మీట్ Tabను నిలిపివేసే అవకాశం కూడా వినియోగదారులకు ఉందని ప్రత్యేక పోస్ట్‌లో గూగుల్ తెలిపింది. యాప్ పై లెప్ట్ కార్నర్‌లో ఉన్న సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. మీ అకౌంట్లో Settings ఆప్షన్ నొక్కండి> (=) హాంబర్గర్ మెను నుంచి Meet అన్‌చెక్ చేయండి. Gmail యాప్‌లోని Meet Tab ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్ లేదా సర్వర్-సైడ్ అప్‌డేట్‌తో రూపొందించారా అనేది స్పష్టత లేదు.