చైనా యాప్స్ నిషేధం ఉత్తర్వులు ఫేక్, కేంద్రం క్లారిటీ

తూర్పు లద్దాఖ్ లోని గాల్వాన్‌ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో

తూర్పు లద్దాఖ్ లోని గాల్వాన్‌ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో

తూర్పు లద్దాఖ్ లోని గాల్వాన్‌ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. భారతీయులు ప్రతీకారంతో రగిలిపోయారు. చైనాను దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని, ఆ దేశానికి గుణపాఠం చెప్పాల్సిందే అనే డిమాండ్లు వినిపించాయి. ఇందులో భాగంగా బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ నినాదం వినిపించారు. చైనా వస్తువులను నిషేధించాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఇదే సమయంలో చైనాకు సంబంధించిన కొన్ని మొబైల్ యాప్స్ ని భారత్‌లో నిషేధించినట్లుగా తెలుపుతూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది.

ఆ వార్త అవాస్తవం:
ఫ్యాక్ట్ చెక్ (pib fact check) ద్వారా ఈ విషయంపై స్పందించిన ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో.. చైనా యాప్స్‌ని (china apps) నిషేధించాలని కోరుతూ టెక్ కంపెనీలకు నేషనల్ ఇన్మర్మేషన్ సెంటర్ (National information center) ఉత్తర్వులు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, వాటిని నెటిజన్లు నమ్మవద్దని సూచించింది. ప్రభుత్వం, ఎన్ఐసీ అలాంటి ఉత్తర్వులను విడుదల చేయలేదని స్పష్టంచేసింది.

అసలేం జరిగిందంటే:
భారత్ లో చైనాకు సంబంధించిన కొన్ని మొబైల్ అప్లికేషన్లను నిషేధిస్తున్నట్లు, వాటి పనితీరును వెంటనే పరిమితం చేయాలని టెక్ ఆధారిత కంపెనీలకు భారత ప్రభుత్వం సూచిస్తున్నట్లు ఉన్న ఒక ఉత్తర్వు కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గూగుల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి వాటిని తొలగించాలని టెక్ కంపెనీలైన యాపిల్, గూగుల్ సహా పలు కంపెనీలకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Meity), నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్(NIC) ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆ పోస్టులో ఉంది. భారత్‌లోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లల్లో వినియోగంలో ఉన్న చైనాకు చెందిన 13 అప్లికేషన్లు.. లైవ్ మీ(LiveMe), బిగో లైవ్(Bigo Live), విగో విడియో(Vigo Video), బ్యూటీ ప్లస్(BeautyPlus), కామ్ స్కానర్(Cam Scanner), క్లాష్ ఆఫ్ కింగ్స్(Clash Of Kings), మొబైల్ లెజెండ్స్(Mobile Legends), టిక్ టాక్(TikTok), క్లబ్ ఫ్యాక్టరీ(ClubFactory), షీన్(Shein), రొమ్ వే(Romwe), ఆప్ లాక్, వి మెట్(Vmate), గేమ్ ఆఫ్ సుల్తాన్‌(Game Of Sultan)ను నిషేధిస్తున్నట్లు ఆ పోస్టులో ఉంది. కాగా ఆ ఉత్తర్వు అసత్యమని పీఐబీ(PIB) స్పష్టం చేసింది.

డ్రాగన్ ఆర్మీ దురాఘాతాన్ని నిరసిస్తూ దేశంలో చైనాకు చెందిన యాప్‌లను, వస్తువులను బహిష్కరించాలని భారతీయులందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. దీంతో చైనాకి వ్యతిరేకంగా పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి నిజమో కాదో తెలుసుకోకుండానే నెటిజన్లు వాటిని తెగ షేర్ చేస్తున్నారు.