Edible Oil Prices: వంట నూనెల ధరలు తగ్గించండి.. కంపెనీలకు కేంద్రం ఆదేశం

దేశంలో సరిపడా వంట నూనెల ఉత్పత్తి జరగడం లేదు. మన దేశ అవసరాల్లో దాదాపు 60 శాతం వంట నూనెల్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో మన దేశంలో కూడా ధరలు అందుబాటులో లేకుండా పోయాయి.

Edible Oil Prices: అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు తగ్గిన దృష్ట్యా మన దేశంలో కూడా ధరలు తగ్గించాలని వంట నూనెల తయారీ సంస్థలను ఆదేశించింది కేంద్రం. దిగుమతి చేసుకున్న నూనెలపై లీటర్‌కు కనీసం పది రూపాయల వరకైనా తగ్గించాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వారంలోపు ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరింది. ఒక బ్రాండుకు సంబంధించిన ధరలు ఒకేలా ఉండేలా చూడాలని సూచించింది.

Indian Coast Guard: సముద్రంలో మునిగిపోయిన షిప్.. 22 మందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

దేశంలో సరిపడా వంట నూనెల ఉత్పత్తి జరగడం లేదు. మన దేశ అవసరాల్లో దాదాపు 60 శాతం వంట నూనెల్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో మన దేశంలో కూడా ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. అయితే, ఇప్పుడు అంతర్జాతీయంగా నూనెల ధరలు భారీగా పతనమయ్యాయి. దీనికి తగ్గట్లే గత నెలలో రూ.10-15 వరకు ధరల్ని కంపెనీలు తగ్గించాయి. ప్రస్తుతం మరింతగా ధరలు తగ్గడంతో మరో పది రూపాయల వరకు తగ్గించాలని నూనెల తయారీ కంపెనీలను ఆదేశించినట్లు చెప్పారు ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండే. ఈ మేరకు వంట నూనెల అసోసియేషన్స్, కంపెనీలతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ధరల తగ్గింపుపై కంపెనీలకు కూలంకషంగా వివరించామన్నారు.

Hyderabad: మహిళలకు పోర్న్ వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్టు

అంతర్జాతీయంగా పది శాతం ధరలు తగ్గాయని, అందువల్ల వినియోగదారులకు కూడా ఆ మేరకు తగ్గింపులు ఉండాలని సూచించినట్లు చెప్పారు. ఈ నిర్ణయంపై సంస్థలు సానుకూలంగా స్పందించాయన్నారు. కంపెనీలు ధరలు తగ్గించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. మరోవైపు ఒక బ్రాండుకు చెందిన నూనెల ధరలు ఒకేలా ఉండాలని కూడా కేంద్రం కోరింది. ప్రస్తుతం వేర్వేరు జోన్లలో వేర్వేరు ధరలు అమలవుతున్నాయి. ఒక్కో జోన్‌కు రూ.3-5 వరకు తేడా ఉంటోంది. దీన్ని తొలగించాలని కేంద్రం కోరింది. మన దేశం ప్రధానంగా పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు