Govt Says 1.71 Lakh Rape Cases Registered in India in Five Years
Rajya Sabha: మహిళల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో ఒక చోటు మహిళలు, చిన్నారులు, లైంగిక దాడికి గురవుతున్నారు. లేటెస్ట్‌గా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన లైంగిక దాడుల గణాంకాలను పార్లమెంట్ వేదికగా ప్రభుత్వం వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా 2015 నుంచి 2019 వరకు ఒక లక్షా 71 వేల లైంగిక దాడులు జరిగాయని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 22 వేల 753 రాజస్ధాన్‌లో 20 వేల 9 వందల 37, మహారాష్ట్రలో 14 వేల 707 లైంగిక దాడి ఘటనలు జరిగాయని చెప్పారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 8 వేల 51 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయని తెలిపారు.
నాలుగేళ్ల వ్యవధిలో ఒక లక్షా 71 వేల అత్యాచార కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీటిలో అత్యధిక కేసులు మధ్యప్రదేశ్‌లో నమోదు కావడం ఆ రాష్ట్ర ప్రజలు సహా ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత రాజస్థాన్ ఉన్నట్లుగా ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ ఈ సమాచారం ఇచ్చారు. రాజస్థాన్‌లో 20,937, ఉత్తర ప్రదేశ్‌లో 19,098 మరియు మహారాష్ట్రలో 14,707 మంది మహిళలపై లైంగిక దాడి జరిగినట్లు చెప్పారు.
2015 నుంచి 2019 మధ్య ఢిల్లీలో మొత్తం 8,051 అత్యాచార కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2015 లో దేశవ్యాప్తంగా 34,651, 2016 లో 38,947, 2017 లో 32,559, 2018 లో 33,356 మరియు 2019 లో 32,033 రేప్ కేసులు నమోదయ్యాయని మంత్రి చెప్పారు.