తెలంగాణలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ చికిత్స అందించాలని డిసైడ్ అయ్యింది. ఒక్కో పేషెంట్‌పై పదివేలు ఖర్చు చేయనుంది. నేటి నుంచే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ట్రీట్‌మెంట్ ప్రారంభం కానుంది. తెలంగాణలో కరోనా బాధితులకు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని బోధనాసుపత్రుల్లో చికిత్స ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.
కరోనా చికిత్సకు అవసరమైన మందులు, పీపీఈ కిట్లు, ఇతర అన్ని సౌకర్యాలను సర్కరే ఆయా హాస్పిటల్స్‌కు ఇవ్వనుంది. ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించనుంది. పేషెంట్ల నుంచి ఒక్క రూపాయి కూడా చేయవద్దని, వాళ్లకు పెట్టే ఆహారానికి డబ్బులు కూడా సర్కారే చెల్లిస్తుందని హాస్పిటల్స్‌కు ఇచ్చిన గైడ్‌లైన్స్‌లో వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
కరోనా పేషెంట్లకు అవసరమైన మందులు, ఇతర వస్తువుల కోసం ఇండెంట్ పెట్టాలని హాస్పిటల్స్ సూపరింటెండెంట్లకు సూచించింది. ప్రైవేటులో కరోనా ట్రీట్‌మెంట్‌కు అవసరమైన ప్రోటోకాల్‌ను ఫీవర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ తయారు చేస్తున్నారు. అవసరమైన సలహాలు, సూచనల కోసం గాంధీ , నిమ్స్ డాక్టర్లను సంప్రదించాల్సిందిగా టీచింగ్ హాస్పిటళ్లకు సూచిస్తున్నారు. ఇక కరోనా ట్రీట్‌మెంట్‌కు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేస్తోన్న ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి ఈటల పరిశీలించారు. హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ సహా పలు ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్‌ను ఆయన పరిశీలించారు.
ఒక్కో పేషెంట్‌కు రూ. 10వేలు ఖర్చు
గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కలనున్న ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్‌లో కరోనా చికిత్స ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ అందుబాటులోలేని దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్‌ను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వైద్యులు రిఫర్ చేసిన పేషెంట్లకు మాత్రమే ప్రైవేట్‌లో ట్రీట్‌మెంట్ అందించనున్నారు.
ఇందుకోసం ఒక్కో పేషెంట్‌కు కనీం పదివేల వరకు ఆయా హాస్పిటల్స్‌కు చెల్లించాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే ఈ అమౌంట్‌పైన ప్రైవేట్ యాజమాన్యాలు సుముఖంగా లేనట్టుగా తెలుస్తోంది. పేషెంట్ కండిషన్‌ను బట్టి చెల్లించాలని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు కోరుతున్నట్టుగా సమాచారం. త్వరలో ఇదే అంశంలో పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను ఇచ్చేందుకు తెలంగాణ ఆరోగ్యశాఖ సన్నద్ధం అవుతోంది.