ఆవుల బంగారు నగలు చేయించి..మెడలో వేసి…గులాబీ పూల వర్షంలో ముంచెత్తిన యజమాని

ఇంటిలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందంటారు. అదే ఇంటిలో పెంచుకునే ఆవును కూడా మహాలక్ష్మి అని పూజిస్తాం. పండుగలకు..ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆవులను పూజించటం హిందూ సంప్రదాయంలో భాగంగా వస్తోంది. అంత భక్తిగా కొలుచుకునే ఆవులకు ఓ జంతు ప్రేమికుడు..ఆవుల యజమాని ఏకంగా బంగారు, వెండి ఆభరణాలు చేయించి ఆవుల మెడలో వేసి తన ప్రేమను చాటుకున్నాడు. ఆతరువాత ఆవులపై గులాజీ పూల వర్షాన్ని కురిపించాడు.

Gujarat Man Made Jewelry For His Cow

Gujarat man made jewelry for his cow :  ఇంటిలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందంటారు. అదే ఇంటిలో పెంచుకునే ఆవును కూడా మహాలక్ష్మి అని పూజిస్తాం. పండుగలకు..ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆవులను పూజించటం హిందూ సంప్రదాయంలో భాగంగా వస్తోంది. అంత భక్తిగా కొలుచుకునే ఆవులకు ఓ జంతు ప్రేమికుడు..ఆవుల యజమాని ఏకంగా బంగారు, వెండి ఆభరణాలు చేయించి ఆవుల మెడలో వేసి తన ప్రేమను చాటుకున్నాడు. ఆతరువాత ఆవులపై గులాజీ పూల వర్షాన్ని కురిపించాడు.

గుజ‌రాత్‌కు చెందిన విజ‌య్ ప‌ర్సానాకు ఓ ఉంది. దానికో దూడ పుట్టింది. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు విజయ్ పర్సానా. అవంటే విజయ్ కు ఎంత ప్రేమంటే..వాటికి ఏకంగా బంగారు, వెండి న‌గ‌లు చేయించే అలకంరించి మురిసిపోయేంత ప్రేమ.

అత‌ను ఆవుల‌కు ఆభ‌రణాలు చేసేందుకు మంచి మంచి డిజైన్లు చూపించాడు. అవి నచ్చటంతో అటువంటి ఆభరణాలే చేయించాడు. ఆ త‌ర్వాత విజ‌య్ తన కుటుంబ సభ్యులతో పాటు ఆవును, దూడ‌ను ఏబీ జ్యువెల‌ర్స్‌కు తరలించి.. అక్క‌డ ఓ గ‌దిని పూల‌తో సుంద‌రంగా డెకరేట్ చేయించి..తన ఆవు, దూడ‌లకు బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రింప‌జేశారు. అనంత‌రం వాటికి స్వీట్లు, ఫ్రూట్స్ పెట్టారు. ఆ తరువాత ఆ రెండింటిపై గులాబీ పూల వ‌ర్షం కురిపించి ‘‘ఇవి మా ఇంటి మహాలక్ష్ములు ‘‘అంటూ  తెగ మురిసిపోయాడు.