Russia : రష్యన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పులు… 8మంది విద్యార్థులు మృతి
సమాచారం అందిన వెంటనే... రష్యన్ పోలీసులు.. యూనివర్సిటీకి వెళ్లారు. కాల్పులు జరుపుతున్న దుండుగుడిని గుర్తించి న్యూట్రలైజ్ చేసిపడేశారు.

Russian University
Russia Gun Firing : రష్యాలో గన్ తో రెచ్చిపోయాడు ఓ దుండగుడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. పర్మ్ క్రై నగరంలోని పర్మ్ స్టేట్ యూనివర్సిటీ(PSU)లో సోమవారం(సెప్టెంబర్ 20, 2021) జరిగిన ఫైరింగ్ లో 8మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం… యూనివర్సిటీలోని ఓ భవనంలో ఉదయం గన్ తో విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు దుండగుడు. ఉదయం 11 గంటల టైంలో అతడు వర్సిటీ బిల్డింగ్ లోకి ఎంటరైనట్టు ఆ తర్వాత గుర్తించారు.
గన్ తో ఫైరింగ్ మొదలుపెట్టగానే.. విద్యార్థులు హాహాకారాలు చేశారు. అరుపులు, కేకలతో.. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భీతావహ వాతావరణం కనిపించింది. చాలామంది విద్యార్థులు… తమ క్లాస్ రూమ్ లకు లోపలివైపు లాక్ చేసుకున్నారు. మరికొందరు ఆడిటోరియంలోకి వెళ్లి దాక్కుని గడియ పెట్టుకున్నారు. దుండగుడికి దొరక్కుండా… తమను తాము రక్షించుకున్నారు. గన్ మేన్ వస్తున్న దారిలో అతడికి దొరక్కుండా ఉండేందుకు ప్రయత్నించారు మరికొందరు. ఈ ప్రయత్నంలో కొందరు విద్యార్థులు పై అంతస్తుల కిటికీల నుంచి నేలమీదకు దూకేయడం కనిపించింది.
సమాచారం అందిన వెంటనే… రష్యన్ పోలీసులు.. యూనివర్సిటీకి వెళ్లారు. కాల్పులు జరుపుతున్న దుండుగుడిని గుర్తించి న్యూట్రలైజ్ చేసిపడేశారు. ఈ ఘటనను బయటనుంచి వీడియో తీశారు చాలామంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#BREAKING: Shooting reported at Russian university, harrowing footage shows students jumping out of windows to escape gunman
More: https://t.co/gV0sv3xUdE pic.twitter.com/bZYNG177yM
— RT (@RT_com) September 20, 2021