Bride Dance
Bride Dance Viral video : పెళ్లంటే పెళ్లికూతురు సిగ్గు పడుతు వచ్చి పెళ్లి పీటలమీద తల వంచుకుని కూర్చునే రోజులు పోయాయి. ఇప్పుడు పెళ్లికూతుళ్లు వారి పెళ్లి బట్టల నుంచి జ్యువెలరీ నుంచి అన్ని వారే స్వయంగా షాపింగ్ చేస్తున్నారు.అంతేకాదు వారి పెళ్లి ఎలా జరగాలో వారే స్వయంగా ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లి వేదిక దగ్గరకు డ్యాన్సులతో ఇరగదీస్తు అద్దిరిపోయే స్టెప్పులు వేసుకుంటు వస్తున్నారు.
పెళ్లిని చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్న నేటి యూత్. అందుకే.. పెళ్లికి ఓ 10 రోజుల ముందు నుంచే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌తో పాటు సంగీత్, హల్దీ లాంటి వేడుకలు, డ్యాన్సులు ఇలా పక్కా ప్లాన్ తో అద్దరగొట్టేస్తున్నారు. తమ పెళ్లికి తామే చక్కగా ఎంజాయ్ చేస్తు తాళి కట్టించుకుంటున్నారు. పెళ్లి కూతుళ్లు తమ డ్యాన్సులతో పెళ్లికొడుకుల్ని కూడా ఫిదా చేసేస్తున్నారు. వధువు డ్యాన్స్ వేస్తుంటే ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తు ఆనందిస్తున్నారు. ఇలా నేటి యువత తమ పెళ్లి మెమోరీస్‌ను తమ గుండెల్లో భద్రపరుచుకుంటున్నారు.
తాజాగా ఓ వధువు తన పెళ్లిరోజును భలే ప్లాన్ చేసుకుంది.అన్ని అనుకున్నది అనుకున్నట్లుగా చేసి కాబోయే వాడితో పాటు నెటిజన్లు కూడా ఫిదా చేసింది. కత్రినా కైఫ్ పాటకు సూపర్బ్ గా డ్యాన్స్ చేస్తు వచ్చి పెళ్లి కొడుకుకు ఉంగరంతో ప్రపోజ్ చేసి..తెగ వైరల్ అయిపోతోంది.
గూర్గావ్‌కు చెందిన సబా కపూర్ అనే పెళ్లికూతురు అయ్యింది. పెళ్లికి ఎంట్రీ సమయంలో తానే కాకుండా తన కుటుంబ సభ్య అందరితో కలిసి కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన బార్ బార్ దేఖో సినిమాలోని సా ఆస్‌మానోకో అనే పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టింది. అందరితో డ్యాన్స్ వేస్తూ వచ్చింది. అలా పెళ్లికొడుకు దగ్గరకు చేరుకొని అతడికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేసింది. తన సహచరి సరికొత్త ఎంట్రీకి పెళ్లికొడుకు ఫిదా అయిపోయాడు. నెటిజన్లు కూడా వావ్.. అంటున్నారు.
If my entire family doesn’t recreate this on my hypothetical wedding, I will die a sad brown girl. pic.twitter.com/8y3b5pLU3g
— harram (@diaryofashrimp) December 25, 2021