H1B Visas : భారత టెక్కీలకు ఊరట..మరో రౌండ్ లో H1B వీసాలు
హెచ్ 1బీ వీసాలకు ప్రస్తుతం డిమాండ్ అధికంగా ఉంది. ప్రతిఏటా అమెరికా 85వేల కొత్త హెచ్ 1 వీసాలను జారీచేస్తుంది.
- Guntupalli Ramakrishna
- Published On : July 30, 2021 / 01:29 PM IST
H1b Visa
H1B Visas : యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ తీపికబురందించింది. ఈ వార్త ఒకరకంగా భారత టెక్కీలకు ఊరటనిచ్చేదే.. రెండో రౌండ్ లాటరీ పద్దతిలో హెచ్ 1బీ వీసాలు జారీ చేయనున్నట్లు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. మొదటి రౌండ్ లాటరీ విధానంలో అనుకున్న స్ధాయిలో ఎంపికలు జరగకపోవటంతో రెండో రౌండ్ లాటరీ నిర్వహిస్తున్నట్లు యుఎస్ సి ఐఎస్ ప్రకటించింది.
హెచ్ 1బీ వీసాలకు ప్రస్తుతం డిమాండ్ అధికంగా ఉంది. ప్రతిఏటా అమెరికా 85వేల కొత్త హెచ్ 1 వీసాలను జారీచేస్తుంది. వృత్తి నైపుణ్య నిపుణులు వీటిని సద్వినియోగం చేసుకుంటుంటారు. వీరిలో అధిక సంఖ్యలో చైనా, భారత్ వంటి దేశాలకు చెందిన ఐటీ సంస్ధలకు చెందిన నిపుణులు ఉంటున్నారు. వీసాల జారీ విషయంలో లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం నిర్ణయించటంతో మొదటి రౌండ్ లాటరీ విధాన్ని పూర్తిచేశారు.
ఆగస్టు 2 నుండి ప్రారంభం కానున్న పిటిషన్ ఫైలింగ్ ప్రక్రియ నవంబర్ 3తో ముగియనుంది. ఇదిలా వుంటే వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30 వరకు హెచ్ 1బీ వీసాలకు దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కొందరిని హెచ్ 1బీ వీసాలకు మొదటి లాటరీలో ఎంపిక చేసింది. ప్రస్తుతం రెండో రౌండ్ లాటరీ ద్వారా హెచ్ 1బీ వీసాలు జారీ చేస్తామన్న ప్రకటనతో స్టెమ్, ఒపీటీ విద్యార్ధులకు ఊరట లభించినట్లైంది.
