Rahul Gandhi: ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తున్నాం: రాహుల్ గాంధీ

"దేశం చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని, విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని చీల్చేస్తున్నారు. మనం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలి

Rahul Gandhi: ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతూ, దేశాన్ని ముక్కలు చేయాలనే ప్రయత్నాలు ప్రస్తుతం దేశంలో చూస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న ఆర్జేడీ సీనియర్ నేత శరద్ యాదవ్ ను శుక్రవారం రాహుల్ గాంధీ పరామర్శించారు. ఢిల్లీలో శరద్ యాదవ్ నివాసానికి చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడ మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని పార్టీలను ఒక తాటిపైకి తెచ్చే కార్యక్రమానికి పావులు కదుపుతున్నట్టు ఇరువురు నేతలు చెప్పుకొచ్చారు. ఈసందర్భంగా శరద్ యాదవ్ మాట్లాడుతూ దేశ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతు, దేశాన్ని విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

Also read:Chandrababu Letter : వైసీపీ నేత ఆత్మహత్యపై చంద్రబాబు బహిరంగ లేఖ

రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించాలా? అని మీడియా అడిగిన ప్రశ్నకు శరద్ యాదవ్ స్పందిస్తూ..”ఎందుకు కాదు? కాంగ్రెస్‌ను 24 గంటలూ ఎవరైనా నడుపుతున్నారంటే, అది రాహుల్ గాంధీనే. ఆయనను పార్టీ అధ్యక్షుడిగా చేయాలి అని నేను అనుకుంటున్నాను. అప్పుడే ఏదైనా గొప్పగా చేయగలదు” అంటూ సమాధానం ఇచ్చారు. ఈసందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..దేశాన్ని ముక్కలు చేయాలనే ప్రయత్నం జరుగుతుందన్న శరద్ యాదవ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. “దేశం చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని, విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని చీల్చేస్తున్నారు.

Also read:Odisha Journalist : జర్నలిస్ట్‌పై దాడి చేసి కాళ్లకు బేడీలు వేసిన పోలీసులు

మనం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలి. ఒకసారి మన చరిత్రలో భాగమైన సోదరబావ బాటలో నడవాలి” అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. గత రెండేళ్లలో మీడియా సంస్థలు, బీజేపీ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్ నిజాలను దాచిపెట్టాయి. మెల్లగా నిజం వెలుగులోకి వస్తుంది. శ్రీలంకలో అదే జరుగుతోంది. అక్కడ నిజం బయటపడింది. భారత్‌లో కూడా నిజం త్వరలో తెరపైకి వస్తుందని ” రాహుల్ చెప్పుకొచ్చారు.

Also read:R. Krishnaiah : గవర్నర్ గవర్నర్ గానే ఉండాలి.. రాజకీయ నాయకురాలుగా ఉండకూడదు: కృష్ణయ్య

ట్రెండింగ్ వార్తలు