Dubai Lottery : ఉద్యోగం పోయి రోడ్డున పడ్డాడు… లాటరీ రూపంలో అదృష్టం వరించింది.
తాజాగా ఆలాటరీ డ్రా తీయగా అందులో నజీరాలి కొనుగోలు చేసిన టిక్కట్టుకు రెండో బహుమతి వచ్చింది. ఇందుకు గాను 1 మిలియన్ దిర్హమ్స్ ను గెలుచుకున్నాడు.
- Guntupalli Ramakrishna
- Published On : July 23, 2021 / 02:50 PM IST
Lottry
Dubai Lottery : అసలే ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్నాడు. చేతిలో డబ్బు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అదృష్టం అతని తలుపుతట్టింది. లాటరీ రూపంలో కోటి రూపాయలకు పైగా డబ్బు వచ్చిపడింది. ఇంకేముంది అతని కళ్ళల్లో ఆనందానికి అంతులేకుండా పోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడుకు చెందిన 53 సంవత్సరా నజీరాలీ దుబాయ్ లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుటుంబసభ్యులు గత కొంతకాలం వరకు తనతోపాటే ఉన్నారు. అయితే కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోవటంతో ఆర్ధిక ఇబ్బందుల నేపధ్యంలో కుటుంబసభ్యులను ఇండియాకు పంపించేశాడు. తానొక్కడే తిరిగి ఉద్యోగం సంపాదించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాడు.
ఈ క్రమంలో తన స్నేహితునితో మహజూజ్ తో కలసి ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. తాజాగా ఆలాటరీ డ్రా తీయగా అందులో నజీరాలి కొనుగోలు చేసిన టిక్కట్టుకు రెండో బహుమతి వచ్చింది. ఇందుకు గాను 1 మిలియన్ దిర్హమ్స్ ను గెలుచుకున్నాడు. స్నేహితులిద్దరు చెరిసంగం పంచుకోగా నజీరాలి వాటాగా 5లక్షల దిర్హమ్స్ వచ్చాయి. అంటే కోటి రూపాయల పైగా దక్కాయి.
లాటరీ రూపంలో అదృష్టం తలుపు తట్టటంతో నజీరలీ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో ఈ డబ్బుతో ఓ రెస్టారెంట్ ప్రారంభించాలని చూస్తున్నాడు. మరికొంత డబ్బును సేవాకార్యక్రమాలకు ఖర్చు చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు.
