Telangana Heavy Rains : తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత మరో 24 గంటల్లో బలపడి ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశముందని పేర్కొంది. అయితే, ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని తెలిపింది.
- bheemraj
- Published On : August 12, 2022 / 09:23 PM IST
Heavy Rainfall In Telangana
Heavy rains in Telangana : తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత మరో 24 గంటల్లో బలపడి ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశముందని పేర్కొంది. అయితే, ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని తెలిపింది.
Telangana Rains Forecast : తెలంగాణలో ఆగస్టు14 వరకు వర్షాలు
అయినప్పటికీ శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. కాగా, రాబోయే 48 గంటల్లో అకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది.
